CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా న్యాయ అవగాహన కార్యక్రమం ప్రారంభం.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 2 మన్యం టీవీ :- శనివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ కొత్తగూడెం ఆధ్వర్యంలో గాంధీ జయంతి మరియు ఆజాద్ కి అమృత్  మహోత్సవం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగూడెం కోర్టు ప్రాంగణం ర్యాలీ ప్రదర్శన ను ప్రారంభించి చమన్ బస్తి లో ఉన్న  జ్యోతి అనాధ వృద్దాశ్రమం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం కొత్తగూడెం  అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.శ్రీనివాస్. జ్యోతి అనాధ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి జి. శ్రీనివాస్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ న్యూఢిల్లీ వారు భారత దేశం అంతటా న్యాయ  అవగాహన కార్యక్రమాలను చేస్తున్నారని చెప్పారు. వృద్ధుల ఆరోగ్య సమస్యలు మరియు వారి వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వారికీ ఎటువంటి సమస్యలు ఉన్న మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ కొత్తగూడెం వారికి  దరఖాస్తును  ఇవ్వడం ద్వారా న్యాయం  చేస్తారని చెప్పారు. వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు.కొత్తగూడెం బార్ ప్రెసిడెంట్ లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ నిరాదరణకు గురైన వృద్ధులకు వారికి ఆశ్రయం కల్పించిన నిర్వాహకుడికి అభినందనలు తెలియజేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదని అలా చేసిన ఎడల వారు శిక్షార్హులు అవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు బార్ అసోసియేషన్ కోశాధికారి యండి సాదిక్ పాషా, అరికాల కరుణాకర్,  మహిళా న్యాయవాది ఆర్తీ మక్కడ్, పాల రాజశేఖర్, మెండు రాజమల్లు, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ప్రతిభ,మహేశ్వరరావు వృద్ధాశ్రమం నిర్వాహకుడు రవీందర్,జ్యోతి  సేవ్ క్రియేషన్ ఎన్జీఓ భాద్యులు బి. పుష్ప లతా, జోగు కల్యాణి, ఆర్తీ మక్కడ్, జోగు భాస్కర్, యంఏ. రహమాన్, జక్కుల రామసీత, యంఏ. సావీర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: