CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన గూడెం సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మెచ్చా హామీ.

Share it:

                                     


  

మన్యం న్యూస్:/దమ్మపేట(అక్టోబర్-07): పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలోని రాజుపేట గిరిజన గూడెం గ్రామ వాసులకు తప్పని కష్టాలు.వర్షాకాలం వచ్చిందంటే గ్రామనికి వచ్చే రహదారి పక్కన ఉన్న చెరువులోని నీళ్లు రహదారి పైకి వచ్చి రహదారి మొత్తాన్ని వరద నీటితో నింపుతుంది.గిరిజనలు ప్రతి రోజు ఆ నీటిలోని రహదారిలోనే పిల్లలను స్కూల్ కి పంపడం,నిత్య అవసరాల సరుకులు తీసుకురావడం, నిండు గర్భిణీల సైతం ఆసుపత్రికి వెళ్లేందుకు కిలోమీటర్ పైన నీళ్ల లో మెయిన్ రోడ్డు చేరుకోవాల్సిన పరిస్థితులను ఎదుర్కొంటూ ఇబ్బందులు పడుతున్నారు.గిరిజనుల బాధలు చూడలేక ఆ ప్రాంత టి ఆర్ ఎస్ నాయకులు కోయ్యల అచ్యుతరావు,గిరిజనులతో కలిసి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కు వినతి పత్రం ఇవ్వగా.ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వెంటనే స్పందించి చరవాణి ద్వారా పంచాయతీ రాజ్ డిఈ తో మాట్లాడి,త్వరగా ఆ రోడ్డు మార్గానికి సైడ్ వాల్ ఏర్పాటు చేయవలసిందిగా మాట్లాడారు. త్వరలోనే ఆ గ్రామ గిరిజనులకు బాధలు లేకుండా సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టి ఆర్ ఎస్ నాయకులు కోయ్యల అచ్యుతరావు,రాయల నాగేశ్వరావు, బోల్లికొండ ప్రభాకర్,గిరిజనులు ఉన్నారు.

Share it:

Post A Comment: