CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గురుకుల పాఠశాలను మంగపేట నుండి మల్లంపల్లి కి తరలించే ఆలోచన మానుకోవాలి

Share it:

మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అన్ని వసతి సౌకర్యాల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తునటువంటి గురుకుల పాఠశాలను ఇక్కడి నుండి తీసి ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి   తరలించాలి అన్న ఆలోచన  కొంత మంది ఉన్నత అధికారుల ప్రొద్భలంతో బలంతో ఎస్సి రెసిడెన్షియల్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించాలనే ఆలోచన చేస్తున్నారు  ఆ ఆలోచనను విరమించుకోవాలి అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున డిమాండ్ చేస్తన్నాము.మంగపేట మండలంలో ఉన్న గురుకుల పాఠశాలను ఇక్కడే ఉంచాలి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఈ పాఠశాలను మల్లంపల్లికి మార్చాలి అన్న ఆలోచనను మానుకోవాలి. మంగపేట లో ఉన్న సౌకర్యాలు అక్కడ విద్యార్థులకు ఉండవు 
అద్దెకు భవనాలు తీసుకోని పాఠశాల పెడితే విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతారు అని ఈ సందర్బంగా 
ఎమ్మార్పీఎస్ మంగపేట మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ ప్రెస్ మీటులో మాట్లాడడం జరిగింది. ఎమ్మార్పీఎస్ సీనియర్  నాయకులు పాలమాకుల సోమనర్సయ్య మాదిగ, లంజపెళ్లి పెద్ద శ్రీను మాదిగ, మండల అధికార ప్రతినిధి గాజర్ల రాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ మాజీ అధ్యక్షులు వెంపెళ్లి మల్లేష్ మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ కదురు మల్లేష్ మాదిగ, పత్రిక ద్వారా మంగపేట మండలంలో ఉన్న పాఠశాలను మల్లంపల్లికి మార్చాలి అనుకుంటున్న వాళ్ళు ఆ ఆలోచనను మానుకోవాలి మానుకొనని యెడల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలియజేసారు.
Share it:

TS

Post A Comment: