CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు రైతు పొలికేకను విజయవంతం చేయండి

Share it:

 


*అక్టోబరు 5న

*రాజకీయ లబ్ధి కోసమే మంత్రివర్గ ఉపసంఘం.

*మిడియం బాబురావు మాజీ పార్లమెంటు సభ్యులు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎం జి ఫంక్షణహల్ లో సి.పి.ఐ ఎం.ఎల్ నాయకులు సారయ్య అధ్యక్షతన జరిగిన పోడు రైతు పొలికేక అఖిలపక్ష సదస్సుకు ప్రొఫెసర్ కోదండరామ్ మరియు మాజీ ఎంపీ మీడియం బాబురావు హాజరై మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా పోడు సాగుపై ఆధారపడి గిరిజనులు బతుకుతున్నారని ఆ భూముల కు హక్కుపట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు పెట్టుకున్నారని సాగులోనే ఉంటున్నారని కానీ ప్రభుత్వం వారికి ఆ భూములపై హక్కు పట్టాలివ్వటంలేదు.అలాగే ఈ సమస్యను పరిష్కరించటంలో గత ఏడేండ్లుగా జాప్యం చేయటం వల్లే ఈసమస్య జఠిలం గా మారిందని సాగు చేస్తున గిరిజన రైతులపై అటవీ శాఖ,పోలీసులు దాడులు చేస్తున్నారని వేసిన పంటలను సైతం జేసీబీలతో నాశనం చేస్తూ,కందకాలు తవ్వుతూ అడ్డుకున్న గిరిజనులు,పేదలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతు,హత్యానేరం కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇందులో పసి పిల్లలు, మహిళలు ఉన్నారు.గ్రామాలు, గిరిజన గూడేలు,తండాలులో యుద్ధ వాతావరణం ఏర్పడిన పరిస్థితి ఉందని అన్నారు.ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.సీఎం స్వయంగా జిల్లాలు పర్యటించి కుర్చీవేసుకునే మరీ పోడుభూముల సమస్యకు ముగింపు పలుకుతానని పదే పదే చెప్తున్న..ఆచరణకు నోచుకోవడంలేదని వారు అన్నారు.పర్యావరణం దెబ్బతింటున్నదీ, తేమ పోతున్నది,దానివలన వర్షాలు రావు,కరువులు వస్తాయి,అనే ఫారెస్ట్ అధికారుల వాదనలకు పోడు వ్యవసాయం కారణం కాదు,దీనికీ దానికి సంబంధమే లేదు.పోడు వ్యవసాయం అంటే మామూలు తుప్పలు, చిన్న చిన్న మొక్కలు చదును చేస్తారు.పెద్ద వృక్షాలను గిరిజనులు అసలు వారు నరకరు.మహావృక్షాలను కూల్చి సాగు చేసే యాంత్రిక శక్తి వారికి లేదని వాళ్లమీద నేరం వేసి, భూమి దక్కకుండా చేయడం తప్ప మరొకటి కాదని ఈ అడవినీ,దానిలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలో భాగంగా ఇలాంటి వాదనలు తీసుకువస్తున్నారని అన్నారు.రెండో రోడ్డుమాప్ ప్రకటించాలని ఎఫ్ఆర్ సి కమిటీలు వేయాలని గ్రామసభలు జరపాలని దరఖాస్తులు తీసుకోవాలని కోరుతున్నాం అని అన్నారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ (నోడల్‌ ఏజన్సీ),అటవీ శాఖ,రెవెన్యూ శాఖ కలుపుకుని ఆ ముగ్గురి సంతకాలతో పట్టాలివ్వాలని చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నా..దీని అమలులో అనేక కొర్రీలు పెట్టి అమలు చేయకపోవటం చట్ట వ్యతిరేకం కాకపోతే మరేంటి? అని ప్రశ్నించారు.గిరిజనులకు చట్టం సానుకూలంగా ఉన్నా..వారికి హక్కు పత్రాలు ఇవ్వటం లేదు. కానీ..చట్ట విరు ద్దంగా కంపెనీలకు ఇస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని వాపోయారు. ఇందుకోసమే.. అక్టోబర్‌ 5న 400కి.మీ. మేర జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహిస్తున్నమని ఈ సందర్భంగా ముఖ్యంగా డిమాండ్‌ చేసేది ఒక్కటే..పోడు భూముల పట్టాల సమస్య ముందు తేల్చాలి.హరిత హారం పేరుతో వాళ్ల భూముల్ని ఆక్రమించటం ఆపాలని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.ఈ సదస్సుకు రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అచ్యుత రామారావు,సిపిఐ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరావు, టిడిపి రాష్ట్ర నాయకులు యానాల అనంత రెడ్డి,రైతు సంఘం జిల్లా నాయకులు మొగిలి ప్రతాప్ రెడ్డి,సిపిఎం జిల్లా నాయకులు తుమ్మల వెంకటరెడ్డి,ఎండి దావుద్, ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట మట రఘు,సరోజన,నాసర్, తుడుందెబ్బ నాయకులు పొడేం రత్నం,దబ్బ సుధాకర్,చింత కృష్ణ,మంజుల బిక్షపతి,దబ్బగట్ల జనార్ధన్, కొరగట్ల లక్ష్మణరావు,దబ్బగట్ల లక్ష్మయ్య, తిప్పన పల్లి సుదర్శన్,లక్ష్మయ్య,కొమరం లక్ష్మి,వంక రాములు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: