CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్

Share it:

 


  • తెలంగాణ, ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్
  • ముగ్గురు మావోయిస్టుల మృతి
  • ఏకే-47, ఎస్ఎల్ఆర్ తో పాటు మారణాయుధాలు లభ్యం
  • ఎన్కౌంటర్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్.

తెలంగాణ చత్తీస్ఘడ్ సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిందని ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల తో పాటు మారణాయుధాలు, కిట్ బ్యాగ్స్, ఇతర వస్తువులు లభ్యమైనట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.

సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఎన్కౌంటర్ వివరాలు ఎస్పీ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రం లోని ములుగు జిల్లా, చత్తీస్గఢ్ రాష్ట్రం లోని బీజాపూర్ జిల్లా సరిహద్దులలో దట్టమైన అటవీ ప్రాంతంలో  ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ వారు  హత్యలు చేయడానికి ప్రైవేట్,ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి వ్యూహరచన చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా సోమవారం ఉదయం ములుగు పోలీసులు,బిజాపూర్ పోలీసులు, తెలంగాణ  గ్రేహౌండ్స్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ప్రభుత్వ నిషేధిత మావోయిస్టు పార్టీ దళ సభ్యులు పోలీసు దళాల పైకి కాల్పులు జరపగా   ప్రత్యేక దళాలు ఎదురు కాల్పులు 

జరిపారు,

కాల్పుల అనంతరం ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయగా ముగ్గురు మగ మావోయిస్టుల మృతదేహాలు ఆయుధాలు, మరికొన్ని వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు.

కాల్పులు జరుపుతూ కొంతమంది మావోయిస్టులు పారిపోయారని తెలిపారు. పారిపోయిన మావోయిస్టుల  కోసం

పోలీస్ ప్రత్యేక దళాలు ఏటూరునాగారం, వాజేడు, పేరూరు, వెంకటాపురం అటవీ ప్రదేశంలో కూంబింగ్ నిర్వహిస్తున్నాయని,

కాల్పులు జరిగిన సంఘటన ప్రదేశం చత్తీస్గఢ్ రాష్ట్రం ఎల్మిడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని తెలిపారు.

ఆ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వారు పరిశోధన చూసుకుంటారని అన్నారు.

సంఘటన స్థలంలో ఒక ఎస్ఎల్ఆర్ ఎల్ఎంజి,ఏకే 47 బయో నెట్ తో కలిపి, ఒక ఎస్ఎల్ఆర్,ఒక ఆయుధం,ఎస్ఎల్ఆర్ ఎల్ఎంజి మ్యాగ్జిన్స్ 3, ఏకే 47 మాక్సిన్  3, రౌండ్స్ 28, ఎస్ఎల్ఆర్ 2 మ్యాగ్జిన్స్, 24 రౌండ్స్,ఎక్స్ప్లోజివ్ కార్డుఎక్స్ వైర్, ప్రెజర్ కుక్కర్, వైర్, హ్యాండ్ గ్రానెడ్ 1, కత్తి 1, 12 కిట్ బాక్స్, కెమెరా ప్లాష్ 3, సోలార్ ప్లేట్ 4, సోలార్ ససీట్స్ 1, వాటర్ క్యాన్స్ 2 లభించినట్లు ఎస్పీ తెలిపారు.

గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీ వారు ఏజెన్సీ అటవీ ప్రాంతం, కాలినడక దారులలో మందుపాతరలు పెట్టడం వలన సామాన్య ప్రజలు, జంతువులు మందుపాతరల బారిన పడి ప్రమాదాలకు గురయి ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ మందుపాతర వలన సోయం పెంటయ్య ముకునూరు పాలెంవాసి మృతి చెందాడన్నారు.

మావోయిస్టు పార్టీ వారి అనాలోచిత చర్యల వల్ల గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కాకుండా మావోయిస్టులు అడ్డుకుంటున్నారని తెలిపారు.

చాలా మంది ఆదివాసీలు మావోయిస్టుల అరాచకాల వల్ల  చత్తీస్ఘడ్ నుండి తెలంగాణకు వచ్చిరాని, ఆదివాసి ప్రజలను భయపెట్టి వారి ఇండ్లలోకి చొరబడి వారి దోపిడీ చేయడం వలన ఆదివాసులు ఆర్థికంగా మానసికంగా నష్టపోతున్నారని అన్నారు.

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఓఎస్డి శోభన్ కుమార్, ములుగు ఎస్పి పోతురాజు సాయి చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

NATIONAL

TELANGANA

Post A Comment: