CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చాటి చెప్పిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ. 👉జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్.

Share it:

 



భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 2 (మన్యం టీవీ) :- శనివారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో గాంధీ జయంతి వేడులను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడారు. మహాత్ముడు ఏది చెప్పారో అది ఆచరించారని తెలిపారు. అహింసా సిద్ధాంతాన్ని నమ్మి ప్రపంచ దేశాల మద్దతు పొందారని తెలిపారు. అహింసతోనే ఏదైనా సాధించవచ్చని నమ్మి, భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహానీయుడు గాంధీ అని కొనియాడారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని చెప్పారని తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధిస్తుందని చెప్పారన్నరు. అంటరాని తనం నిర్మూలనకు ఎంతో కృషిచేశారన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ కలలు కన్న ఆశయాలు కోసంకృషి చేస్తున్నాయని తెలిపారు. స్వచ్ఛాభారత్ పథకాన్ని మిషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో చదువు ముగించుకుని  భారత దేశానికి తిరిగి వచ్చిన తరువాత గాంధీ మహాత్ముడు దేశం మొత్తం పర్యటించి , దేశంలోని ప్రజలు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. గ్రామాలు ఎలా ఉన్నాయి. వారి జీవిన విధానం ఎలా ఉందని ఆనాడే సునిశితంగా పరిశీలన చేశారని తెలిపారు. అపరిశుభ్రత వలన గ్రామీణ ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని గమనించారు. ఆయన ఆశయాలు నేడు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. వాటిని కింది స్థాయి ప్రజలకు అందేవిధంగా పనిచేయాలని కోరారు. స్వచ్చ భారత్ లో మన జిల్లాను అన్ని రంగాల్లో ప్రధమ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లాలోని ఇతర అధికార యంత్రాంగానికి రోల్ మోడల్ గా ఉండే విధంగా కలక్టరేట్ ఉద్యోగులు మహాత్ముని జీవితంలో చూపిన విధంగా చిత్త శుద్ధితో, మనుసు పెట్టి పనిచేయాలని కోరారు. అనంతరం కొత్తగూడెం సూపర్ ఐజార్ సెంటర్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ పూల మాల వేసి నివాళి అర్పిచారు. స్వచ్ఛభారత్ మిషన్, స్వచ్ఛ తెలంగాణ  కార్యక్రమంలో భాగంగా విశిష్ట సేవలు అందించిన కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ పరిధిలో పని చేస్తున్నా పలువురు పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రశంస పత్రాలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్ ఓ అశోక్ చక్రవర్తి ,ఏఓ గన్యా , మున్సిపల్ చైర్ పర్స న్ కాపు సీతాల క్ష్మీ , కమీషనర్ ఏ.సంపత్ కుమార్, కలెక్టరేట్  సిబ్బంది  పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: