CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలికలు వ్యక్తిగత శుభ్రత,వ్యక్తిగత భద్రతతోపాటు ప్లాస్టిక్ నిషేధం కి ప్రాధాన్యతనివ్వాలి.

Share it:

 


"జేడీ ఫౌండేషన్" ఆధ్వర్యంలో అవగాహన సదస్సు బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్& మాస్కులు పంపిణీ.


కౌమార దశలో ఉన్న బాలికలు తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత భద్రత మరియు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు జె.డి పౌండేషన్ భద్రాచలంభాద్యుడు శ్రీ మురళి మోహన్ కుమార్, ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాజంలో వైరస్లు బారి నుంచి కాపాడుకోవాలంటే బాలికల వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే టోల్ఫ్రీ నెంబరు తెలుసుకుని సామాజిక భద్రత కు, సెల్ఫ్ డిఫెన్స్ గురించి నేర్చుకొని తమని తాము రక్షించుకో వాలని కోరారు, ప్లాస్టిక్ నిషేధం, మొక్కలు నాటడం లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో మరో సభ్యురాలు శ్రీమతి హన్సి మాట్లాడుతూ ప్రత్యేకంగా కౌమార దశలో ఉన్న బాలికలు ఎదుర్కొన్న సమస్యలుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బాలికలకు బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్, మాస్కులు పంపిణీ చేశారు. ఈ శానిటరీ నాప్కిన్స్ మరియు మాస్కులు పంపిణీకి సహకరించిన సత్యం ఎటు హెల్ప్ ఫౌండర్ శ్రీమతి మానస మరియు ఎక్స్ట్రా మైల్ నాగ మోహన్ మరియు శ్రీ అంబికా సురేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీమతి  సిహెచ్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రతి ఉన్న సమాజం కి అవసరమైన కార్యక్రమం నిర్వహించినందుకు జేడీ ఫౌండేషన్ కి కృతజ్ఞతలు తెలిపారు, అలాగే కాలేజి విద్యార్థులు తరగతి గదులకు సరిపడా ఫ్యాన్ లు లేక ఇబ్బంది పడుతున్నారని కావున విద్యార్థులు సౌకర్యార్థం ఫ్యాన్లు అందించాలని కోరారు.  దీనికి ఫౌండేషన్ తరఫున సహకరిస్తామని మురళీమోహన్ కుమార్ తెలిపారుతెలిపారు. ఈ కార్యక్రమంలో  కళాశాల ఎన్ఎస్ఎస్ క్యాంపు కోఆర్డినేటర్ పి. ఆనంద్ బాబు తో పాటు లెక్చరర్లు శ్రీ ఖురేషీద్ అహ్మద్ ,శ్రీ కె. పి. డి. వర రాజు ఫౌండేషన్ సభ్యులు శ్రీ క డా లి నాగరాజు శ్రీమతి హన్సి, శ్రీ అంబికా సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: