CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులపై హత్యాకాండ కు పాల్పడ్డ హంతకులను కఠినంగా శిక్షించాలి!! సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

Share it:

 


మణుగూరు సబ్ సబ్ డివిజన్ కమిటీ

మన్యం టీవి, అశ్వాపురం:

ఉత్తర ప్రదేశ్ లో రైతాంగం పై మారణహోమం జరిపిన ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి హంతకులను కఠినంగా శిక్షించాలని మతతత్వ బిజెపి హింస రాజకీయాలను ప్రతి ఒక్కరు ఖండించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి సీనియర్ నాయకులు జగ్గన్న కోరారు మంగళవారం అశ్వాపురం మండలం సీతారాంపురం గ్రామంలో జరిగిన అఖిలభారత రైతు కూలీ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రైతువ్యతిరెక నల్లచట్టాలనురద్దుచెయాలని నిరసన తెలుపుతున్న ఉద్యమాకారులపై కెంద్ర హోం శాఖ సహాయ మంత్రి కూమారుడు. ఆశిష్ మిశ్రా అద్వర్యంలొ తన కాన్వాయ్ ని ఉద్యమాకారులపై తొక్కించి తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నలుగురు రైతులను హత్యచేసి 15 మందిని తీవ్రంగా గాయపరచడాన్ని CPI ML న్యూడెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు. ఘటన జరిగి 15 రోజులైనా ఇంతవరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాడి జరిపి మారణకాండకు కారకుడైన ఆశిష్ మిశ్రా తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పై చర్యలు తీసుకోలేదని అన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతులపై జరిగిన మారణకాండ పై కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించి వెంటనే స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయాలని రైతుల హత్యాకాండకు కారకులైన హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుండి వెంటనే తొలగించాలని ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రాను కఠినంగా శిక్షించాలని రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చెయ్యాలని రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమoలో అఖిలభారత రైతు కూలీ సంఘం అశ్వాపురం మండల కార్యదర్శి బండ్ల వెంకటేశ్వర్లు మలికంటి రాము ఇరప ఎర్రయ్య భీమయ్య ధర్మయ్య మహాలక్ష్మి పద్మ సీతమ్మ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: