CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నేడు పాడేరు చింతపల్లి లలో పర్యటన లో జాతీయ మిర్చి టాస్క్ బోర్డు డైరెక్టర్

Share it:

 


  • నేడు పాడేరు చింతపల్లి లలో పర్యటన లో జాతీయ మిర్చి టాస్క్ బోర్డు డైరెక్టర్
  • ఆంధ్రా కాశ్మీరం అరకు
  • ఇక్కడి గిరిజనుల ఆతిధ్యం మర్చిపోలేనిది.
  • జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి

మన్యం టీవీ మంగపేట.

ఆంధ్రా కాశ్మీరం అరకు అని ఇక్కడ గిరిజన సంస్కృతి సంప్రదాయాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయి అని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. శనివారం  ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా వికాస్ అగ్రి ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి విజయనగరం జిల్లాలోని తాటిపూడి రిజర్వాయర్ మరియు  విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాఫీ తోటలు మిరియాల పంట సాగు కి  భారత ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు బాగున్నాయని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని ప్రశంసించారు రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల వ్యవసాయ సేవలు ఒకే దగ్గర అందించటం రైతాంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉందన్నారు రైతు భరోసా పథకం రైతులకు ఆర్థికంగా చేయూతనీ ఇస్తుందన్నారు సుగంధద్రవ్యాల అధికారులు మిరియాల పంట పండిస్తున్న రైతుల కోసం ఎస్ టి డి ఎఫ్ పథకం బేస్ లైన్ ఇప్పటికే రూపొందించినట్లు వివరించారు కాఫీ రైతులు కాఫీ గింజల మద్దతు ధరలను పెంచే  విధంగా చూడాలని కోరగా ఈ విషయమై ఇప్పటికే కాఫీ బోర్డు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రాసెసర్స్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు  వెల్లడించారు. అనంతరం కాఫీ బోర్డు కార్యాలయం సందర్శించి సంబంధిత అధికారులతో భేటీ అయ్యారు రైతుల కోసం అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం  ఆరకు సమీపంలో స్ధానిక గిరిజనులు బహూకరించిన విల్లు (బాణం) ఎక్కు పెట్టి స్థానిక గిరిజనులతో కలిసే సందడి చేశారు ఈ కార్యక్రమంలో కాఫీబోర్డ్ అధికారులు కాఫీ బోర్డు ఎక్స్టెన్షన్ ఇన్స్ ఫెక్టర్ శ్రీమతి స్రవంతి  కాఫీ బోర్డు అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ శ్రీమతి భవాని మరియూ  వికాస్ అగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ డైరెక్టర్ కాట్రగడ్డ రవీంద్రనాథ్ టూరిజం సిబ్బంది పాల్గొన్నారు

శనివారం పాడేరు   చింతపల్లిల లో పర్యటన.

నేడు ఆదివారం రోజు చివరి పర్యటనలో భాగంగా పాడేరు చింతపల్లి సీలేరు ప్రాంతాల్లో రైతు ఉత్పత్తి సంఘాల సభ్యులు సుగంధద్రవ్యాల అధికారులు మిరియాల పంట పండించే రైతులు ఎన్జీవో ప్రతినిధులతో సమావేశం అయి మిరియాల పంట ఉత్పత్తి మార్కెటింగ్ పై చర్చించనున్నట్లు తెలిపారు. అనంతరం పాడేరు ఐటీడీయే మరియు సుగంధద్రవ్యాల బోర్డు రీజనల్ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత అధికారులతో పలు విషయాలపై చర్చించనున్నారు .

Share it:

TELANGANA

Post A Comment: