CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అర్హులైన గిరిజనులకు పోడు భూముల పట్టాలు వస్తాయి... తెరాస ఇంచార్గ్ తెల్లం వెంకట్రావు

Share it:

 



మన్యం టీవీ చర్ల: 


భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి తెరాస రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు డివిజన్ పర్యటనలో బాగంగా చర్ల మండలం దేవరపల్లి గ్రామపంచాయతీలో పోడు రైతుల సమస్యలపై ఈరోజు పర్యటించడం జరిగింది. పర్యటనలో భాగంగా రైతులను ఉద్దేశించి తెల్లం వెంకట్రావు మాట్లడుతూ ఇప్పటికే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు పోడు భూములను సమస్యపై మంత్రివర్గ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రివర్గ సబ్ కమిటీ ద్వారా పాత పోడు భూములుకు ఏమైతే అర్హులైన గిరిజన రైతులకు మరియు సన్న చిన్నకారు రైతులకు న్యాయం జరిగేలా త్వరలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని పోడు గిరిజన రైతులకు డాక్టర్ వెంకట్రావు చెప్పడం జరిగింది. పోడు రైతులు వేసుకున్న పంటలను పాడు చేయవద్దని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవరపల్లి పంచాయతీ పోడు రైతులు అధిక సంఖ్యలో మహిళా రైతులు మరియు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నక్క బోయిన శ్రీనివాస్ యాదవ్, ఎస్. డి అజీజ్, తడిక లాలయ్య, కోటి శ్రీనివాస రెడ్డి, పోలిన లంక రాజు, పోలిన రామచంద్ర ,యస్.సి సెల్ అధ్యక్షుడు తోట మల్ల వరప్రసాద్, యస్. టీ సెల్ అధ్యక్షుడు కాపుల నాగరాజు, వసంత్ బ్రహ్మానంద రెడ్డి, సర్పంచులు కోరం నాగేంద్ర, పొడియం మురళి,సీతాపతి రాజు బాబురావు, ముమ్మినేని అరవింద్,యూత్ నాయకులు కాకి అనిల్,సోషల్ మీడియా ఇంచార్జ్ పంజా రాజు, తూర్రం రవి, బంటు వెంకటేశ్వర్లు, ముమ్మినేని సత్య, సంపన్ చంద్రశేఖర్, తోట మల్ల రవి కుమార్, ఆవుల శ్రీకాంత్,భద్రాచలం ఉపాధ్యక్షులు నవాబ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: