CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అసెంబ్లీ లో గర్జించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Share it:

 


*కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15,738 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు రాకుండా దారి మళ్లించారు.

*హరిత హరం పేరుతో పేదొల్ల భూములు లాకుంటు న్నారు.

*2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

*మల్లంపల్లి,రాజు పేట లను మండలాలుగా ప్రకటించాలి.

*ప్రభుత్వ తప్పిదాల పై నిప్పులు చెరిగిన సీతక్క.

*మన్యం టీవీ ఏటూరు నాగారం*

అసెంబ్లీ లో శుక్రవారం ములుగు నియోజకవర్గ సమస్యల పై ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు15,738 కోట్ల రూపాయలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించారని చిన్న చిన్న గ్రామ పంచాయతీలకు కనీసం పని చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి ఉందని 

ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల ప్రభుత్వ వేదింపులు తట్టుకోలేక ఇద్దరు ముగ్గురు సర్పంచులు ఆత్మ హత్యలు చేసుకున్న దుస్థితి పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ దామాలు పూర్తి చేసినప్పటికీ బిల్లులు రకా చేసిన అప్పులు పెరిగి సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు,అని గ్రామ పంచాయతీల అభివృద్ది పై ప్రభుతం రాష్ట్ర ముఖ్య మంత్రి దృష్టి సారించాలని అదే విధంగా ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలు చేసిన ప్రభుత్వం ముఖ్య మంత్రి ములుగు జిల్లా గా ప్రకటించింది.ముఖ్య మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎన్నికల సందర్భంగా మల్లం పల్లి మండలం చేస్తానని మాట ఇచ్చారని మల్లంపల్లి కి అనుకోని 15 గ్రామాలు ఉన్నాయని సుమారు 30 వేల మంది ఉన్న మల్లంపల్లిని మండలం గా మరియు మంగపేట మండలం లోని రాజు పేట ను మండలము గా ప్రకటించాలని ముఖ్య మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు.

అదే విధంగా హరిత హరం పేరుతో పోడు భూములు గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన భూములను గుంజుకుంటుంది అని గత 60 ఎండ్లుగా పోడు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ,బీసీ రైతుల భూములను ఫారెస్ట్ అధికారులు బెదిరించి రైతులను బయబ్రంతులకు గురి చేస్తున్నారని2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి అని గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం వైకుంఠ దామల పేరుతో భూములు బలవంతంగా పేదల భూములు లాకుంటున్నారని అసెంబ్లీ లో ముఖ్య మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు.కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి కంపా నిధులు సుమారు 600 కోట్ల రూపాయలు ఇస్తే వాటిని దుర్వినియోగం చేయకుండా ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

Share it:

Post A Comment: