CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి,మున్సిపాలిటీ సహకారంతో సురక్షా బస్టాండ్ కు మరమ్మతులు: ఆర్టీసీ కార్మికులు, ప్రయాణికుల హర్షం

Share it:

 




మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సురక్షా బస్టాండ్ ప్రాంగణం,గుంతల మాయమై బస్సుల రాకపోకలకు, ప్రయాణీకులకు కూడా ఇబ్బందికరంగా తయారైన బస్టాండ్ అవరణను సింగరేణి యాజమాన్యం,మణుగూరు మునిసి పాలిటి అధికారుల సహకారంతో మంగళవారం నాడు యుద్ధ ప్రాతిపదికన గుంతలను పూడ్చటం తో, బస్టాండ్ ప్రాంగణం సుందరంగా తయారైంది.సురక్షా బస్టాండ్ ఆధునీకరణ కు సంబంధించి టెండర్ ఖరారై,వర్షాకాలం అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతుందని,ఇంకా పనులు ప్రారంభం కాని నేపథ్యంలో బస్టాండ్ ప్రాంగణం గుంతల మయం కావడం వర్షపు నీరు చేరటంతో ఇబ్బందికరంగా తయారైందని,దీంతో ఆర్టీసీ సిబ్బంది, సింగరేణి సేవా సమితి సభ్యులను సంప్రదించారు.తాత్కాలిక మరమ్మతులకు సింగరేణి యాజమాన్యం,మున్సిపల్ శాఖ సహకరించాలని గుర్తింపు సంఘం తగు సహకారం అందించాలని మణుగూరు డిపో మేనేజర్ విజయ్ కుమార్ లిఖితపూర్వక,మౌఖికంగా విజ్ఞప్తి చేయటంతో,సడక్ బంద్ నేపథ్యంలో బస్టాండ్ లో రద్దీ కూడా తక్కువగా ఉంటుందని భావించి,మంగళవారం నాడు గుంతలను పుడ్చారు.ఈ సందర్భంగా సహకరించిన ఏరియా సింగరేణి జిఎం జక్కం. రమేష్ కు, ఎస్ ఓ టు జీఎం.డి. లలిత్ కుమార్ కు,పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి. లక్ష్మీపతి గౌడ్,ఏరియా గుర్తింపు సంఘం నాయకులు వి ప్రభాకర్ రావు,మరియు మున్సిపల్ కమిషనర్ నాగ ప్రసాద్,డిపో మేనేజర్ విజయ్ కుమార్, అసిస్టెంట్ డిపో మేనేజర్ హుస్సేన్,ఓసి-4 టు కేసీఎస్పీ కోల్ ట్రాన్స్ పోర్ట్ టిప్పర్ల యజమాని సుబ్బారావు కు, మణుగూరు సింగరేణి సేవా సమితి సభ్యులు నాసర్ పా షా,ఫిట్టర్ వర్మ ,ఓసి-4 హెడ్ ఒవర్ మెన్ సుబ్బారాజు,లోడర్ ఆపరేటర్ గొల్ల రవి,కోల్ ట్రాన్స్ పోర్ట్ సిబ్బంది యూసఫ్, డ్రైవర్లు లక్ష్మణ్,జె ఎస్ ఆర్ రెడ్డి,బి.రాము,లయన్స్ క్లబ్ సభ్యులు బొలిశెట్టి.భాస్కర్, జెసిబి,ట్రాక్టర్ డోజర్ డ్రైవర్లు, రవి,నరేందర్,బస్టాండ్ కంట్రోలర్ మురళి కృష్ణ,కార్గో సేవల సిబ్బంది సైదులు మరియు ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు,డ్రైవర్, కండక్టర్లు కు,సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

Post A Comment: