CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

💥ఏసీబీ వలలో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవీందర్💥

Share it:

 


👉మున్నూరు కాపు సర్టిఫికెట్స్ కోసం 30 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసి, 12 వేలు రూపాయలకు ఒప్పందం

మన్యం మీడియా ప్రతినిధి/ములకలపల్లి(అక్టోబర్-13):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండల తాహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రవీంద్ర. మున్నూరు కాపు సర్టిఫికెట్స్ నిమిత్తం 30 వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసి 12 వేల రూపాయలు ఒప్పందం కుదుర్చుకొని, బాధితుడు వద్ద నుంచి ఆరు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే మండలంలోని పోగ్గళ్ళపల్లి గ్రామానికి చెందిన సాదం శ్రీనివాస్ రావు కుమార్తె సాదం చందన కు గురుకులంలో ఇంటర్ సీటు రాగా, చదువు నిమిత్తం మున్నూరుకాపు సర్టిఫికేట్స్ కొరకు శ్రీనివాసరావు దరఖాస్తు చేసుకున్నారు. శ్రీనివాసరావు మరియు చందన, ఇరువురికి మున్నూరు కాపు సర్టిఫికెట్ మంజూరు చేయడానికి తహశీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రవీందర్.30 వేల రూపాయలను లంచం డిమాండ్ చేసి, 12 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయంపై శ్రీనివాసరావు, ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారుల పధకం ప్రకారం బుధవారం నాడు శ్రీనివాసరావు వద్ద నుంచి రెవెన్యూ అధికారి రవీందర్ ఆరు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కేసు నమోదు చేశారు. లంచగొండి అధికారిని పట్టుకున్న ఈ కార్యక్రమంలో (ఏసీబీ)డీఎస్పీ- రమణమూర్తి వెంట ఎస్సైలు-రవికుమార్, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: