CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డ్యూటీ చేస్తూ మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్ గ్రేసియా వెంటనే చెల్లించాలి ( సి ఐ టి యు )

Share it:


         మన్యం టీవీ మంగపేట.               తక్షణమే ముఖ్యమంత్రి ఆశా వర్కర్ల తో సమావేశం నిర్వహించాలి                             కామారెడ్డి జిల్లా కు చెందిన రాజంపేట మండల్ పొందుర్తి గ్రామం  ఆశా వర్కర్ రాజ్యలక్ష్మి డ్యూటీ చేస్తూ అవస్థకు గురి అయ్యి అక్కడే కుప్పకూలి మృతి చెందడం జరిగింది ఆమె కుటుంబానికి మంగపేట మండలం రాజుపేట లో సిఐటియు ఆశ యూనియన్ మండల కమిటీ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.               ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఐటీయూ ఆశ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు మాడే రవి  హాజరై మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి కరోన నిర్మూలన కోసం సమయంతో సందర్భం లేకుండా ఆశా వర్కర్లు కీలకంగా పని చేస్తున్నారు వీరి కుటుంబాలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయిందని అన్నారు.ఆశా వర్కర్లు హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నా వీరికి హెల్త్కార్డులు లేకపోవడం చాలా బాధాకరం అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల సేవలు మర్చిపోలేనివి అంటున్నారు తప్ప ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని అన్నారు. ఇప్పటికైనా ఆశా వర్కర్లకు తక్షణమే కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు  ఏవైతే ఉన్నాయో అలాగే ఆశా వర్కర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.   

 *డిమాండ్స్*

              1.పిక్స్డ్ వేతనం 2. ప్రమాద బీమా 3. స్మార్ట్ ఫోన్స్ 4 ఉద్యోగ భద్రత                                   తదితర సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు    ఈ సమావేశానికి హాజరైన ఆశా వర్కర్లు విజయ కుమారి, శ్రీలావత, శాంతా, శ్రావ్య, అమరావతి, రాణి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: