CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాగులో ఉన్న పోడు భూములకు వేంటనే పట్టాలు మంజూరు చెయ్యాలి.

Share it:

 


సాగులో ఉన్న పోడు భూములకు వేంటనే పట్టాలు మంజూరు చెయ్యాలి.

ఏజెన్సీ ప్రాంతంలో ఎపి ఎస్ ఎల్ టి అర్1/59(సవరణ1/70) చట్టని పటిష్ఠంగా అమలు చెయ్యాలి

మన్యం టీవీ కరకగూడెం: సాగులో ఉన్న పోడు భూముల పట్టాల సాధనకై నవంబర్ 1 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకూ ఆదివాసీ సంక్షేమ పరిషత్( ఎ ఎస్ పి) పిలుపులో భాగంగా భారీ ర్యాలీ ని విజయవంతం చెయ్యాలని.కరకగూడెం జెఎసి మండల అధ్యక్షులు పాయం.రాజబాబు,ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ జిల్లా కోశాధికారి సోలం రామారావు, గిరిజన అభ్యుదయ సంఘం నాయకులు ఈసం.సత్యనారాయణ పిలుపునిచ్చారు.వారు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం చట్టానికి ముందు నుండి పోడు నరికి సేద్యం చేస్తున్న పోడు సాగు దారులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వలని వారు కోరారు.ఏజెన్సీ ప్రాంతంలో ఎపి ఎస్ ఎల్ ఎల్ టిఅర్ 1/59 సవరణ 1/70 చట్టాన్ని పటిష్ఠంగా అమలు చెయ్యలని కోరారు.అర్ఓ ఎప్ అర్ పట్టాలు ఉన్న భూములను ఆదివాసీ గిరిజన అమాయక ప్రజల వద్దనుండి పారెస్టు అధికారులు బలవంతంగా తీసుకుని మొక్కలు నాటడం సరికాదన్నారు.అలాగే వచ్చె నెల 1 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి జిల్లా కలెక్టరు కార్యాలయం వరకు పోడు భూముల పట్టాల సాధనకై చేపట్టిన భారీ ర్యాలీ ధర్నా  అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాలు కలెక్టర్ కు సమర్పించనునట్లు వారు తరలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఆదివాసీ గిరిజన ప్రజలు ,యువత  పోడుసాగు దారులు పాల్గొని విజయవంతం చెయ్యలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్తి ఆచార సంస్కృత పరిరక్షణ అధ్యక్షులు డిల్లీ రాంబాబు ,బుగ్గల రాజేందర్, ఈసం ఆదినారాయణ, ఈసం అప్పారావు, మైత వసంతరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: