👉 వగ్గేలపూజ విస్తృత పర్యటనతో కాంగ్రెస్ శ్రేణులు నయా జోష్
మన్యం మీడియా ప్రతినిధి/ అశ్వారావుపేట నియోజకవర్గం:: కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గం యువ నాయకురాలు వగ్గేల పూజ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ములకలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులైన షేక్ ఖాదర్ బాబా, ఇసుబాబు, పుష్పాల హనుమంతు, తాండ్ర ప్రభాకర్, తేజ, వెంకట్రావు, కుంజా రవి, సడియం ప్రసాద్, బుగ్గారపు సత్యనారాయణ, పాలకుర్తి రవి, కొండ్రు రవి, సడియం బక్కులు, ములకలపల్లి మండల జడ్పిటిసి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సున్నం నాగమణి, యూత్ కాంగ్రెస్ నాయకుడు కోరంపల్లి చెన్నారావు లను మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ స్థితి గతులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ విస్తృత పర్యటనలో పూజా వెంట పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: