CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేద్దాం టీఆర్‌ఎస్‌ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి

Share it:



మన్యం మనుగడ, పినపాక :


టీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చిన సభలను కార్యకర్తలు జయప్రదం చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి కోరారు. శుక్రవారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లోని జీవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... 

టీఆర్‌ఎస్‌ పార్టీ స్దాపించి 20 సంవత్సరాలు పుర్తి అవుతున్న సందర్భంగా.. పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. 

 23వ తేదిన గ్రామాల్లో సమావేశాల నిర్వాహాణ, పార్టీ ప్లీనరీ సమావేశం, 27వ తేదిన నియోజకవర్గ సమావేశం, నవంబర్‌ 15వ తేదిన వరంగల్‌లో జరిగే విజయ గర్జన సభలను పార్టీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షులు భాధ్యత తీసుకొని పని చేయాలన్నారు. స్దానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అన్ని గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలన్నారు. వరంగల్‌లో జరిగే విజయ గర్జన సభకు ప్రతి గ్రామం నుండి ఒక బస్సులో కార్యకర్తలు హజరుకావాలన్నారు. కార్యకర్తల సమీకరణ భాధ్యత  పార్టీ గ్రామ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, సొసైటీ డైరెక్టర్‌లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్‌లు, ఆత్మ డైరెక్టర్‌లు, మిగిలిన ప్రజాప్రతినిధులు తీసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు పార్టీ ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో పినపాక మండలం  ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు,బొలిశెట్టి నరసింహారావు, ఉడుముల లక్ష్మిరెడ్డి, కోలేటి భవానీ శంకర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, కొండేరు రాము, డాక్టర్ శ్రీ రామ్ ,పటేల్ కామేష్, కటకం గణేష్‌, వడ్లకొండ శ్రీను, రాయల సత్యనారాయణ, కురికూరి శ్రీను, వారా నర్సింహారావు, సోంపల్లి తిరుపతి , సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నర్సింహారావు, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింతపాటి సత్యం, పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్‌లు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

Share it:

TELANGANA

Post A Comment: