CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు : పల్లె నాగరాజు

Share it:

మన్యం టీవీ మంగపేట.
     మాల ఉద్యోగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడిగా పల్లె నాగరాజును నియమిస్తున్నట్టు తెలంగాణ మలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఒక ప్రకటనలో తెలియజేసారు.
   ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ  పల్లె నాగరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు, ప్రజలకు చేస్తున్న సేవను గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు.
నూతనంగా అధ్యక్షుడిగా నియామకమైన పల్లె నాగరాజు మాట్లడుతూ నా మీద నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించిన పిల్లి సుధాకర్ కు ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్నారు.ఇదే విదంగా నా ఎన్నికకు సహకరించిన తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు చిట్టిమల్ల సమ్మయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లికొండ యాదగిరి, ములుగు జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యామ్ బాబు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
Share it:

TS

Post A Comment: