CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మంగపేట మండల కమిటీ ఎన్నిక

Share it:

 


మన్యం టీవీ మంగపేట. ములుగు జిల్లా మంగపేట మండలం ముక్కిడి పోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మంగపేట మండల కమిటీ ఎన్నిక సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి పొడెం శోభన్, జిల్లా ఉపాధ్యక్షులు నల్లెబోయిన లక్ష్మణ్ రావు ల అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగినది.ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోడెం బాబు,రాష్ట్ర ఉపాధ్యక్షులు కొర్ని బెల్లీ వీరేశం,రాష్ట్ర కోశాధికారి చంద రఘుపతి, ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొప్పుల రవి హాజరయ్యారు. ఇట్టి మండల కమిటీ ఎన్నిక భాగంగా ముందుగా పోరాట యోధుడు శ్రీ కొమరం భీమ్ 81 వ వర్ధంతి పురస్కరించుకొని కొమరం భీం చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.పొదెం బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోడెం శోభన్ ఆధ్వర్యంలో జరిగినది.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంను ఉద్దేశించి పొడెం బాబు, మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం నవాబు కంటే క్రూరంగా ఆదివాసీలను వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను చట్టాలను హరిస్తు ఆణగతొక్కుతున్నారు ఇట్టి ప్రభుత్వాలను, అధికారులను ఎదిరించాలంటే ఆదివాసీలు సంఘటితంగా సంఘాలను ఏర్పాటు చేసుకొని పోరాటం చేయాలని సూచించారు. ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు చట్టాలు మరియు జీవోలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు తుంగలో తొక్కి క్రూరంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ పరిధిలోని 20 శాఖలలోని నియామకాలు ఆదివాసులకు ప్రత్యేక జీవుల ద్వారా చేపట్టాలని ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి జనరల్ రిజర్వేషన్ నియామకాలు చేపట్టడం సరికాదన్నారు కాబట్టి ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్య శాఖ మరియు అటవీ శాఖల్లో చేపట్టిన అన్ని నియామకాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు .రాష్ట్ర కార్యదర్శి వీరేశం మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం పొడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కమిటీలు వేసి కాలయాపన చేయడం సరికాదన్నారు ఇట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమావేశం అనంతరం మండల కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షులు పొదెం నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మడి శోభన్ బాబు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్,చెద మల్లయ్య ఉపాధ్యక్షులు,ఆకా తిరుమల రావు, జిగట శ్రీను, కొండ వసంతరావు, జోగా రామచంద్రయ్య, సోయం చెన్నారావు, మంకీడినాగేశ్వరరావు, జిగట శ్రీను, సహాయ కార్యదర్శులు, రేష శ్యామ్, మల్కo సారయ్య, సోయం అచ్చయ్య, కుర్సం గణేష్, మద్దెల కృష్ణ, వాసం సాంబశివరావు కోశాధికారి: కొమరం శివ కుమార్ ప్రచార కార్యదర్శి, కొమరం నరసింహారావు, కొమరం నాగేష్ సాంస్కృతిక కార్యదర్శి, ఆలెం అశోక్, పోలేబోయిన రామకృష్ణ కార్యవర్గ సభ్యులు, పెద్దల రమేష్, బంగారు సాంబయ్య, అన్నేబోయిన గౌతమ్, సోడే భూపతి లను ఎన్నుకున్నారు.
Share it:

TELANGANA

Post A Comment: