CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సింగరేణి ప్రాంతీయ వైద్యశాల కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది తొలగింపుపై: ఐ.ఎఫ్.టి.యు ధర్నా

Share it:

మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఏరియా సింగరేణి ప్రాంతీయ వైద్యశాల వైద్య సిబ్బంది ఆకస్మిక తొలగింపుపై ఆగ్రహించిన కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది,ఐ.ఎఫ్.టి.యు ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక జిఎం కార్యాలయం ఒక ధర్నా నిర్వహించారు.అనంతరం ఏరియా ఎస్ ఓ టు జీఎం,డి. లలిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు జిల్లా అధ్యక్షులు మిడిదొడ్డి.నాగేశ్వర రావు మాట్లాడుతూ,కరోనా నేపథ్యంలో కోవిడ్ -19 రోగుల వైద్య సేవల నిమిత్తం సింగరేణి ఏరియా హాస్పిటల్ లో ప్రత్యేక ప్రైవేటు వైద్య సిబ్బందిని  నర్సులు,వార్డు బాయ్ లు, ఆయాలు,ఎక్సరే,ల్యాబ్ టెక్నీషియన్స్,పారిశుద్ధ్య సిబ్బంది,వంట సిబ్బంది, స్కావెంజర్స్,రిక్షావాలా శానిటేషన్ సిబ్బంది,ఇలా మణుగూరు సింగరేణి ప్రాంతీయ వైద్యశాల లోనే చాలా మందిని అత్యవసర సేవల సిబ్బందిగా నియమించారనీ,కరోనా మహమ్మారి దాటికి యావత్ ప్రపంచం చిగురుటాకుల వణికిపోయిందనీ,బంధాలు,అనుబంధాలు,స్నేహితులు, సహోద్యోగులు,ఇతర సంబంధాలు ఇవేమీ కూడా కరోనా సోకిన రోగి పట్ల కనీసం  కనికరాన్ని కూడా చూపించలేకపోయాయనీ,కొన్నిచోట్ల కన్న బిడ్డలే మొహం చాటేసిన పరిస్థితి చూశామని, ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి సేవ చేయడానికి వచ్చిన వారే పైన చెప్పిన సేవకులనీ, వీరు కరోనా బారిన పడినా కూడా భయపడకుండా,తిరిగి పనిలోకి వచ్చి కర్తవ్య నిర్వహణలో నిలబడిన వారనీ, వారి సేవలకు కానుకగా సింగరేణి యాజమాన్యం ఆకస్మికంగా తొలగించడం బాధాకరమన్నారు.వారి ఆకలి పోరాటం ఈ పనికి ప్రోత్సహించినదన్నది కూడా ఒక వాస్తవం అని,నిజంగా వారి గుండె ధైర్యాన్ని కూడా అభినందించాలనీ,ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్,ఇలా అనేక అనుభవాలు కూడా కరోనా మిగిల్చిందనీ,కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా వీరందరినీ పిలిచి,రేపటి నుండి మీ సేవలు అవసరం లేదని, ఏరియా హాస్పిటల్ యాజమాన్యం తెలిపారనీ, ఆయన వాపోయారు.కరోనా పూర్తిగా తొలగి పోలేదని,ఇంకా జాగ్రత్తలు పాటించాలని, ఒకవైపు నిపుణులు ప్రకటన లో తెలియజేస్తున్న పరిస్థితి, అంతేగాక కష్టకాలంలో మనకు సేవలందించిన వీరిని,మరికొంత కాలం కొనసాగించాలని ఐ.ఎఫ్.టి.యు డిమాండ్ చేస్తున్నదన్నారు.గుర్తింపు సంఘం కూడా స్పందించాలని వారు కోరారు.
డిమాండ్స్ : 
1)మణుగూరు ఏరియా సింగరేణి ప్రాంతీయ వైద్యశాల లో పనిచేస్తున్న కోవిడ్-19 ప్రత్యేక వైద్య సిబ్బందిని కొనసాగించాలి.
2)సెకండ్ వేవ్ స్పెషల్ ఇన్ సెంటివ్ బకాయిలు వెంటనే చెల్లించాలి.
సింగరేణి నూతన  నియామకాలలో వీరికి అవకాశం కల్పించాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో ఏ. మంగీలాల్,సింగరేణి ప్రైవేటు వైద్య సిబ్బంది ఆర్. విద్యాసాగర్,జయశ్రీ,స్వరూప,కళ,రోజా,కవిత,వేణు శ్రీ, ప్రియదర్శిని,భవాని,ఉదయ రాణి,వంశీ,మరియ,సుజాత, సునీత,సత్యనారాయణ,కలీం,వాసు సంజీవ్,అజయ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: