CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసి హక్కులను చట్టాలను కాలరాస్తున్న కలెక్టర్ ను బర్తరఫ్ చేయాలి.

Share it:

 




  • ఆదివాసి హక్కులను చట్టాలను కాలరాస్తున్న కలెక్టర్ ను బర్తరఫ్ చేయాలి.                                                         
  • ఆదివాసీల హక్కులను బంగ పరిచే జిల్లా కలెక్టర్ నీ బర్తరఫ్ చేయకుంటే ఉద్యమం ఉదృతం చేస్తాం : తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలం.కిషోర్ 

 మన్యం మనుగడ వాజేడు :

ఈరోజు వాజేడు మండల కేంద్రం లో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మండల కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది. ఈ సమావేశం కి ముఖ్య అతిథిగా హాజరైన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు ఆలం.కిషోర్ మాట్లాడుతూ ములుగు జిల్లా అంటే నే పూర్తిగా 90 శాతం 5 వ షెడ్యుల్ ఏరియా గల జిల్లా అని, సమ్మక్క సారలమ్మ వారసులు నివసించే గడ్డ అని కానీ జిల్లా కలెక్టర్ మాత్రం ఆదివాసి చట్టాలు హక్కులను గౌరవించ కుండ షెడ్యుల్ ట్రైబల్ కి వ్యతిరేకంగా తన పరిపాలన కొనసాగిస్తున్నాడు అని అన్నారు. 


ప్రస్తుతం జరిగే నేషనల్ హెల్త్ మీషన్ నుండి వచ్చిన ఆరోగ్య శాఖ ఉద్యోగాలలో, మరియు ఐటీడీ ఏ పరిధిలోని వైద్య శాఖ ఉద్యోగాలలో చాలా స్పష్టంగా జీఓ నెంబర్ 68 ప్రకారం లోకల్ షెడ్యుల్ ట్రైబల్ నీ నియమించాలని ఉన్న, పైగా జీఓ 24 ప్రకారం ఐటిడిఏ లో జిల్లా స్థాయి స్కూట్ని కమిటీ( డి ఎల్ ఎస్ సి) లో షెడ్యుల్ ఏరియా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలు కేటాయించాలి, కానీ జిల్లా కలెక్టర్ రెండు జీవోలను అతిక్రమించి జెనరల్ అభ్యర్థుల చేత ఉద్యోగాలు నింపి ఆదివాసీలను మోసం చేస్తున్నాడని అన్నారు. అందుకే రాజ్యాంగ వ్యతిరేకంగా, నిబంధనలు అతిక్రమించే జిల్లా కలెక్టర్ నీ ములుగు జిల్లా నుండి భర్త రప్  చేయాలని ఉద్యమ కార్య చరణ చేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం కూడా ఈ కలెక్టర్ విధానాలను గుర్తించి బర్తరఫ్ చేయాలని కోరారు.


అనంతరం వాజేడు మండల కమిటీ నీ ఎన్నుకున్నారు


అధ్యక్షులు: యెట్టి,చంద్ర శేకర్


వర్కింగ్ ప్రెసిడెంట్ పద్ధం.సుధాకర్


ప్రధాన కార్యదర్శి: బోదే బోయిన, మహేష్


ఉపాధ్యక్షులు: నల్లేబోయిన.ఆనంద్


కార్యదర్శి: గొంది.రాము


ప్రచార కార్యదర్శి: కణితి.సురేష్


కోశాధికారి: కోరం.నాగరాజు


జేజ్జరి.అధిక

మోడెమ్.రాకేష్

పాయం.పరమేశ్వర్ రావు లు ఎన్నిక అయ్యారని కిషోర్ తెలిపారు


ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు యెట్టి,ప్రకాష్. ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్నిబెల్లీ.గణేష్, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు ఈసం.రాజు. తదితరులు పాల్గొన్నారూ.

Share it:

TELANGANA

Post A Comment: