CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొహమ్మద్ ప్రవక్త ఆశయ సాధనకు పాటుపడాలి

Share it:

 


మైనారిటీ జిల్లా అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా

ఇస్లాం మతాన్ని స్థాపించి మానవజాతిని సన్మార్గంలో నడిపించిన మహమ్మద్ ప్రవక్త యొక్క ఆశయ సాధనకు ముస్లిం సమాజం పాటుపడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా పేర్కొన్నారు. ఈ మేరకు మహమ్మద్ ప్రవక్త జన్మదినము "మిలాద్-ఉన్-నబి" పురస్కరించుకుని మంగళవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చర్ల రోడ్లో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన సమావేశంలో యాకూబ్ పాషా మాట్లాడుతూ.. సౌదీ అరేబియా దేశంలోని పవిత్ర మక్కా నగరంలో పేరు ప్రఖ్యాతలు గల కుటుంబంలో క్రీ.శ. 570 సంవత్సరంలో జన్మించి పేదల యందు దయ, కరుణ చూపించడంతో పాటు సమాజంలో స్త్రీలకు ప్రత్యేక స్థానం కల్పించి మొట్టమొదటి సారిగా సతీసహగమనాన్ని నిర్మూలించిన మహనీయుడిని కొనియాడారు. మానవీయ, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, నైతిక విలువలను బోధించిన మహమ్మద్ ప్రవక్త తుది శ్వాస విడిచే వరకూ పేదల పక్షాన నిలిచారని అన్నారు. మహమ్మద్ ప్రవక్త ఇస్లాం బోధనల పట్ల ఆకర్షితులైన ప్రజలు కుల, మతాలకు అతీతంగా ఇస్లాం మతాన్ని స్వీకరించేవారని తెలిపారు. మొహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం మతంలో హింసకు, తీవ్రవాదానికి ఎక్కడా తావు లేదని చెప్పారు. ఇట్టి మహోన్నత ప్రవక్త యొక్క జన్మదినాన్ని యావత్ ముస్లిం సమాజం కన్నుల పండుగగా జరుపుకుంటారు. అందులో భాగంగానే నేడు జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు అందజేయడం జరిగిందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ, ముస్లిం మైనారిటీ నాయకులు ఎండీ ఖాజా మస్తాన్, ఎండీ సలావుద్దీన్ ఖాన్, ఎస్కే ఇబ్రహీం, మస్తాన్, అబ్దుల్లా, మజహార్, తదితరులు పాల్గొన్నారు.

ఫోటో: రోగులకు పండ్లు అందజేస్తున్న ఎండీ యాకూబ్ పాషా దృశ్యం.

Share it:

Post A Comment: