CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రభుత్వం గుర్తించే దిశగా ఆదివాసి నాయక పొడులు పోరాటం

Share it:


 


 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, వినాయకపురం గ్రామంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం మండల సమావేశం మండల ఉపాధ్యక్షులు గడ్డం చిట్టి బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఏర్పడిన ఆదివాసి నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి లు మాట్లాడుతూ త్వరలో గ్రామగ్రామాన తిరిగి నాయకపోడు సేవా సంఘం గ్రామ కమిటీలు నిర్వహించుకోవాలని, ఆదివాసి నాయకపోడు సంస్కృతి సాంప్రదాయాలు పూర్వం నుండి ఉన్నటువంటి వాటిని సంరక్షించుకుంటూ, ప్రతి నాయకపోడు కుటుంబం చరిత్ర తెలుసుకోవాలని అవగాహన కార్యక్రమం నిర్వహించుకుంటూ, విద్య ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, రాజకీయ, వ్యవసాయ రంగాలలో వెనుకబడి ఉన్నామని అందరితో సమానంగా దూసుకుపోవాలని అందుకోసం అన్ని గ్రామాల నుంచి నాయకపోడు పెద్దలు మహిళలు యువకులు తోడ్పాటును అందించాలని, ప్రభుత్వం అమలు పరుస్తున్న అనేక సంక్షేమ పథకాలకు అందుకోవడంలో వెనుకబడి ఉన్నామని, ఇకపై ఏ సంక్షేమ పథకం అయినా తమ వారు అందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆ దరఖాస్తులు ప్రభుత్వ అధికారుల పరిశీలన చేసి నాయకపోడుకు సంక్షేమ పథకాలు అందేలా చూసుకోవాలని పల్లె స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు చైతన్యవంతులు కావాలని, అందుకోసం ప్రతి నాయకపోడు కుటుంబం సమిష్టి బాధ్యతగా సానుకూలంగా వ్యవహరించి ముందుకు సాగాలని వారు అన్నారు. ఈ సందర్బంగా తమ యొక్క అన్ని సమస్యలతో పాటు పోడు భూమి సమస్య ప్రభుత్వ ద్రుష్టికి పోయే విదంగా ముందు ముందు చర్చలు నిర్వహించుకొని సమస్య పరిష్కరించుకోవాలని చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కోలా లక్ష్మీనారాయణ, సేవా సంఘం మండల అధ్యక్షులు నారం సీతారాం సింగ్, ఉపాధ్యక్షులు గెడ్డం చిట్టి బాబు, ప్రధాన కార్యదర్శి దాది చంటి, కోశాధికారి గెడ్డం సతీష్ బాబు, సహాయ కార్యదర్శి దానపు మంగరాజు, మహిళా అధ్యక్షురాలు ఏదిరాజీ రాజేశ్వరి, రైతు విభాగ అధ్యక్షులు గెడ్డం వెంకటేశ్వరరావు, సంఘం కో కన్వీనర్లు గుజ్జుల శివ, మనగొండ వెంకటేశ్వరరావు, మొగిలి రాంబాబు, మారుతి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: