CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కుల బహిష్కరణ చేయించిన సర్పంచ్ పై తగు చర్యలు తీసుకుని తక్షణమే శిక్షించాలి .

Share it:

 


మన్యం వెబ్ డెస్క్:

ఖమ్మం : నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో చింతకాని మండలం రాఘవాపురం గ్రామం (ఎస్టీ) ఎరుకుల కులానికి చెందిన బాధితుడు నాగరాజు తండ్రి పుట్టబంతి అచ్చయ్య మాట్లాడుతూ .... అగ్ర కులానికి చెందిన చింతకాని మండలం రాఘవాపురం గ్రామం సర్పంచి దగ్గర ఉండి నా కొడుకుని కుల బహిష్కరణ చేయించాడని ఆరోపించారు . తన కూతురు గీతాంజలి టూవీలర్ యాక్సిడెంట్ విషయంలో నా కొడుకు గ్రామ సర్పంచి మాట కాదని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్న నేపధ్యంలో మా మీద కక్ష కట్టి తన మాటను ధిక్కరించిననే కారణంతో కుల బహిష్కరణ చేయించి అనేక రకాలుగా నా కొడుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని , నిన్ను చంపినా ఎవరు అడ్డురారని బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు . ఇదేమీ అన్యాయమని అడిగితే 22 సంవత్సరాల క్రితం ఇందిరమ్మ కోటా కింద వచ్చిన ఇల్లును లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఎరుకల నా కోడక అని కులం పేరుతో దూషిస్తున్నారని గత డెబ్బై సంవత్సరల నుండి ఇదే గ్రామంలో నివాసముంటున్నట్టు పేర్కొన్నారు . సర్పంచ్ బారి నుండి మాకు రక్షణ కల్పించాలని కోరారు . అలాగే టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో దేశాల , రాష్ర్టాలు , గ్రామాలు , మండలాలు అనేక రకాలుగా టెక్నికల్ పరంగా మరియు విద్యారంగంలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కుల బహిష్కరణ లాంటివి జరగడం ఎంత వరకు న్యాయం అని ప్రశ్నించారు . తక్షణమే సర్పంచ్ పై తగు చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు . అట్టి విషయాన్ని సి పి గారి దృష్టికి తీసుకెళ్లామని అలాగే పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు . ఈ కార్యక్రమంలో బాధితుడు కుటుంబసభ్యులు సుజాత , మనీషా , చిన్నకమా , గోవిందమ్మ , నాగబాబు పాల్గొన్నారు .

Share it:

Post A Comment: