CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోరాడితేనే పోడుకు హక్కు

Share it:

 


 👉 ఈ నెల 5న జరగబోయే సడక్ బంద్ రహదారి దిగ్బంధనాన్ని జయప్రదం చేయండి. మాన్యం టివి:ములకలపల్లి మండలం:     

పోడు భూములకు హక్కులు వచ్చే వరకు పోరాటం ఆగదని అఖిలపక్షం నాయకులు హెచ్చరించారు.సిపిఐ యంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కమీటీ సభ్యులు నూపా బాస్కర్,టిడిపి మండల అధ్యక్షుడు తేళ్ల చేన్నయ్య,సిపియం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,సిపిఐ మండల నాయకులు కీసరీ గంగారాజు,కాంగ్రెస్ మండల నాయకులు పుష్పాల హనుమంతరావు,పివైఎల్ జిల్లా కార్యదర్శి పోతుగాంటి లక్ష్మణ్,ల అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,అక్టోబర్ 5వ తారీకున జరిగే సడక్ బంద్ కు పోడు భూముల హక్కు రక్షణ కొరకు ప్రతి పల్లె,పల్లె, ప్రతి వాడ,వాడ, కదలి రావాలని,ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.కెసిఆర్ ప్రభుత్వం 2005 అటవీ హక్కల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.టిఆర్ఎస్ ప్రభుత్వం వేసిన మంత్రి వర్గ ఉప సంఘం కేవలం రాజకీయ ప్రయోజనం కోసమోనని,రాష్ట్రం వచ్చి ఏడేళ్ళ అవుతున్న ఒక్క ఎకారనికి పోడు భూమికి హక్కు కల్పించలేదని హెచ్చరించారు.ఈ నెల 5న మండల కేంద్రంలో జరుగుతున్న సడక్ బంద్ కు పోడు సాగుదాలు కుటుంబాల తో కదలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మల మధు,కుంజా కృష్ట,పోడియం వెంకటేశ్వర్లు,బాబా,గౌరి నాగేశ్వరరావు,వర్షా శ్రీరాములు,తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: