CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైద్య శాఖ లో షెడ్యుల్ ప్రాంత జీఓ లకు విరుద్ధంగా బర్తీ చేస్తే ఊరుకునేది లేదు

Share it:

 


*ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి.అరుణ్ కుమార్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు యెట్టి ప్రకాష్ ఆధ్వర్యం లో బస్టాండ్ సెంటరు ఏటూరు నాగారం లోని డా" బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించటం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మై పతి అరుణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ...డా" బి ఆర్ అంబేద్కర్ రాజ్యంగ నిర్మాత సాక్షిగా ములుగు జిల్లాలో 5 వ షెడ్యుల్ కి వ్యతిరేకంగా వైద్య శాఖ ఉద్యోగాలు బర్తీ చేయబడుతున్నాయని అన్నారు.వైద్య శాఖ లో బర్తీ చేసే ఉద్యోగాల్లో జీఓ నెంబరు 68 తో పాటు,జీఓ నెంబర్ 24 కూడా ఉల్లంఘనకు గురి అవుతుంది అన్నారు. 

షెడ్యుల్ ఏరియాలో ఒక ఉద్యోగం బర్తీ అవ్వాలి అంటే కచ్చితంగా జిల్లా స్థాయి పరిశీలన కమిటీ (DLSC) నిర్దారణ ఐటీడిఏ లో జరగాలి. కానీ దానిని కూడా పరిగంలోకి తీసుకోకుండా ఉల్లంఘన చేస్తున్నారని అన్నారు.ఏమన్నా అంటే సుప్రీం కోర్టు లో జీఓ 3 కొట్టుడు పోయింది అని జిల్లా కలెక్టర్ అంటున్నారని,కానీ ప్రభుత్వం నుండి కానీ కోర్టు నుండి కానీ జిల్లా కలెక్టర్ కి ఏం సర్క్యులర్ లు ఉన్నాయి అనేది తెలుపలి అన్నారు.పక్క జిల్లాలలో నోటిఫికేషన్ లు, జీఓ లు మెన్షన్ చేసి ఇస్తుంటే ములుగు జిల్లాలో మాత్రం,ఉత్త ప్రకటన తో సరిపెట్టుకున్నారు. అని అన్నారు.వైద్య శాఖ ఉద్యోగాలపై పోరాటాలు ఉదృతం చేస్తాము అని అన్నారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు అయిన మంత్రులను మా ప్రాంతాలకు వస్తె అడ్డు కుంటం అన్నారు.అక్టోబర్ 20 కొమరం బీమ్ సాక్షిగా ఈ జిల్లా కలెక్టర్ మాకొద్దు,షెడ్యుల్ ప్రాంత జీవోలను తుంగలో త్రొక్కి ఆదివాసీలను మోసం చేసే ఈ కలెక్టర్ మాకొద్దు,అని జిల్లా వ్యాప్తంగా పెద్ద మహా ఉద్యమం నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్న కలెక్టర్, షెడ్యుల్ ప్రాంత జీవోలను వ్యతిరేకంగా పరిపాలన చేయటం దారుణం అన్నారు.అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్ర అనంతరం తదుపరి కార్య చరణ ఈ కలెక్టర్ మాకొద్దు అని,దున్న పోతులకు మెమొరాండం,మౌన దీక్ష ,జలదీక్ష,రాస్తా రోకోలు ధర్నాలు,చివరగా ములుగు జిల్లా ఆదివాసి ప్రజలతో బారి బహిరంగ సభ నిర్వహణ చేయనున్నట్లు అరుణ్ కుమార్ తెలిపారు.ఈ కార్య క్రమం లో తుడుందెబ్బ మండల అధ్యక్షులు ఈసం రాజు, ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వాసం అరుణ్ కుమార్, నాయకులు గొప్ప నవీన్,ఈసం తిమ్మిత్ తది తరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: