CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇల్లు దగ్ధం అయినా బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం

Share it:

 



మన్యం టీవి, అశ్వరావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, పాత మామిళ్ల వారిగూడెంలో కరెంటు తీగలు తెగి కోమటి మహేశ్వరావు ఇల్లు మీద పడడంతో ఇల్లు పూర్తిగా కాలిపోయింది సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న ఆదివాసి నాయకపోడు సేవా సంఘం మండల కమిటీ సభ్యులు తక్షణమే పాత మామిళ్ల వారిగూడెం చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 25 కేజీల బియ్యం, కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సేవా సంఘం జిల్లా సభ్యులు కోలా లక్ష్మణ్ ద్వారా అశ్వారావు పేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావుకి విషయం తెలియజేసి ఫోన్ ద్వారా బాధితులతో మాట్లాడించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా ఫోన్ లో మాట్లాడుతూ బాధితులకి ధైర్యం చెప్పి, త్వరలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు శాంక్షన్ అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సేవా సంఘం మండల అధ్యక్షుడు నారం సీతా రామ్ సింగ్ మాట్లాడుతూ బాధితులు ఎన్నోమార్లు చెబుతున్నప్పటికీ విద్యుత్ అధికారులకు ఇంత నిర్లక్ష్యం ఆయన ధోరణి పనికి రాదని, జరిగిన ఈ నష్టానికి చట్టపరంగా వారిపై చర్యలు తీసుకునేలా చేసి మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం మండల ప్రధాన కార్యదర్శి దాది చంటి, ఉపాధ్యక్షులు గెడ్డం చిట్టి బాబు, సంగం కృష్ణమూర్తి, కోశాదికారి గెడ్డం సతీష్ బాబు మరియు సంఘం సభ్యులు నారం జగదీష్, బేతం రాము, తాళ్ల వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: