CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పండిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాము అని హామీలు ఇచ్చిన ప్రభుత్వం మాటకు కట్టుబడాలి

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

ములుగు జిల్లాలో వరి,మిర్చిపంటలు ఎక్కువగా వేయడం జరిగింది . మొన్నటి వరకు పండిన ప్రతి గింజను కొంటామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు చేయమనడం చాలా బాధకరమని రైతుల ఆవేదన చెందుతున్నారని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ తన ఆవేదన వ్యక్తం చేసారు.ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని బీరాలు పలికిన ప్రభుత్వం ఇప్పుడు రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా మారి ఇప్పుడు వడ్లు కొనుగోలు చేయము అంటే వేసిన వరి పంట పరిస్థితి ఏమిటి, పోయిన సంవత్సరం దొడ్డు వడ్లు కొనుగోలు చేయమని,సన్నాలే కొనుగోలు చేస్తాం అని చెప్పి రైతులను ఇబ్బందులు పెట్టారు,ఇప్పుడు వడ్లు అసలే కొనుగోలు చేయం అని చెప్పి ప్రజల్ని ఇబ్బందులకు గురించేయడం ఎంత వరకు సమంజసం వరి పంట ములుగు జిల్లా లో అత్యధికంగా వేయడం జరిగింది ఈ సంవత్సరం కొనుగోలు చేసి వచ్చే ఏడాదికి రైతులకు ముందుగానే వేయొద్దని చెప్పి ప్రజలను చైతన్యపర్చి పంట మార్పిడి వైపు ప్రజలను మల్లించాలి అని ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే వర్షాలు పడి వాగులు, వంకలు, నదులు పొంగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ ప్రభుత్వం రైతుల నెత్తిమీద పిడుగులాంటి వార్తతో రైతులను కష్టాల పాలు చేయడానికి కంకణం కట్టుకొని ధాన్యం కొనుగోలు చేసే ప్రసక్తే లేదు అంటున్నారు.రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండ వడ్లు కొనుగోలు చేయాలి రైతే రాజు అని వేదికలు కట్టించి ఇపుడు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సంవత్సరం వడ్లు కొనుగోలు చేయక పోతే రైతులే ప్రభుత్వానికి బుద్ధి చెప్పుతారు అని ఎమ్మార్పీఎస్ యువ నాయకులు ఎల్పీపున్నారావు, ఎల్పీ.ఆదినారాయణ, గుండెట్టి జంపయ్య, కృష్ణ,శ్యామ్ బాబు, రైతులు ముత్తయ్య,సమ్మయ్య, నరసింహారావు, శ్రీరాములు, సమ్మక్క,రాజేశ్వరి,కమల, నర్సక్క, తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: