CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదల జీవితాలను నాశనం చేస్తున్న జూదం డ్రగ్స్ మాఫియాను అరికట్టాలి!

Share it:

 


మన్యం టీవి, అశ్వాపురం:

సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ

మణుగూరు సబ్ డివిజన్ కమిటీ

"""""""""""""""""""'"""""""""""""""""'""""""""

మణుగూరు సబ్ డివిజన్ పరిధిలో విచ్చలవిడిగా డ్రగ్స్ మాఫియా పేకాట నెంబర్ల ఆట (దోబీ) వంటి జూదం గ్రామాల్లోకి పాకి పేదల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయని ఇలాంటి వాటికి అలవాటు పడిన వారు ముఖ్యంగా యువత దూరంగా ఉండాలని అలాగే అధికారులు వీటిపై ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకోవాలని

 సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి కోరారు గురువారం సబ్ డివిజన్ లో విజృంభిస్తున్న పేకాట నెంబర్ల ఆట(దోబీ) డ్రగ్స్ మాఫియా గురించి అవగాహన కల్పించడంలో భాగంగా న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అశ్వాపురం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మోర రవి పాల్గొని మాట్లాడుతూ

అశ్వాపురం మండలంలోని మల్లెల మడుగు మొండికుంట మణుగూరు మండలం తోగ్గుడెం విజయనగరం గొర్రెపెంటవాగు పరిసరాల్లో సాంబయ్యగూడెం చెరువు పరిసరాలలో పేకాటజూదం జోరుగా సాగుతోందనీ అన్నారు గ్రామాల్లో కొంతమంది పురుషులు పేకాట కొంతమంది మహిళలు నెంబర్ లాట (దోబీ)కొంతమంది యువకులు గంజాయి వంటి డ్రగ్స్ కు అలవాటుపడి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అశ్వాపురం మండలం మల్లెల మడుగు కేంద్రంగా డ్రగ్స్ మాఫియా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతుందని అన్నారు మొండికుంట ఎస్టీ కాలనీలో డ్రగ్స్ బారినపడి ఒక యువకుడు ఈ మధ్యనే చావుబతుకుల నుండి బతికి బయట పడినట్లు తెలిసిందన్నారు సబ్ డివిజన్ లోని కొన్ని గ్రామాల్లో ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మహిళలు గుంపులు గుంపులుగా వీధి రోడ్ల పై చేరి దోబీ జూదం ఆడటం కనిపిస్తుందన్నారు

మణుగూరు పివి కాలనీలో ఎప్పటి నుండో గంజాయి అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు

కొంతమంది డబ్బు సంపాదనే ధ్యేయంగా అమాయకులను ఇలాంటి ఉచ్చులోకి దింపి వాటికి బానిసలుగా తయారు చేస్తున్న వారి పట్ల పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరారు ఇలాంటి చెడు మార్గాల వైపు వెళ్లేవారు తమ పద్ధతులు మార్చుకుని చైతన్యవంతులు కావాలని మన చుట్టూ సమాజంలో రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చయ్య సురేష్ అశోక్ రాము సీతారాములు లక్ష్మయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: