CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మానవత్వం చాటిన జేడీ ఫౌండేషన్.

Share it:

 


మన్యం టీవి వెబ్ డెస్క్:

ఆత్మహత్య చేసుకోబోయే వృద్ధురాలిని కాపాడి వృద్ధాశ్రమంలో చేర్పించిన వైనం.. సహకరించిన బూర్గంపాడు ఎస్సై జితేందర్.



మానవత్వం పరిమళించిన వేళ జెడి పౌండేషన్ చేసిన మంచి పనిని స్వాగతించారు బూర్గంపాడు ఎస్సై శ్రీ జితేందర్. ఈ మేరకు భద్రాచలం భూపతి రావు కాలనీకి చెందిన సూదిబాక లక్ష్మీ అనే 70 సంవత్సరాల వృద్ధురాలు నా అనుకున్న వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య చేసు కోవడానికి ప్రయత్నం చేయగా సారపాక ప్రాంతానికి చెందిన జేడీ పౌండేషన్ సభ్యుడు శ్రీ కే. పవన్ కుమార్ అతని భార్య శ్రీమతి సుజాతలు తమ ఇంటికి తీసుకెళ్ళి భోజనం భోజనం పెట్టి తక్షణ సహాయం కోసం జేడి ఫౌండేషన్ భాద్యుడు శ్రీ మురళీమోహన్ వారిని సంప్రదించగా ఆయన సూచన మేరకు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో లీగల్ గా దరఖాస్తు చేసి, వృద్ధాశ్రమం నందు చేర్పించడానికి తగు సహాయం చేయవలసిందిగా ఎస్సై సహకారం కోరారు, తక్షణమే స్పందించిన శ్రీ జితేంద్ర వృద్ధాశ్రమం నందు వృద్ధురాలిని చిన్నగా కోరుతూ లిఖితపూర్వకంగా లెటర్ అందజేశారు. వెంటనే జేడీ పౌండేషన్ సభ్యురాలు శ్రీమతి హన్సి పర్యవేక్షణలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీ పవన్ కుమార్ ,శ్రీ కడాలి నాగరాజు,మరియు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు శ్రీమతి సుజాత కలిసి వృద్ధురాలిని భద్రాచలంలోని శ్రీ సరోజినీ వృద్ధాశ్రమం నందు చేర్పించారు. మానవత్వంతో వృద్ధురాలిని కాపాడిన జేడీ ఫౌండేషన్ ని శ్రీమతి సరోజిని, పలువురు ప్రముఖులు అభినందించారు.

Share it:

Post A Comment: