CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజనుల ఫిర్యాదులపై నిర్లక్ష్యం ఎందుకు...?

Share it:

 


   

 గొప్ప వీరయ్య, మన్యసీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు


*గిరిజన చట్టాలను *కాలరాస్తున్న అధికారులు

 *మునుముందు గిరిజనుల మనుగడ ప్రశ్నార్థకం?

*అనాదిగా వస్తున్న ఆదివాసి చట్టాలకు రక్షణ ఎవరు?

మన్యం టీవీ మంగపేట.                                 

 మంగపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మన్యసీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య మాట్లాడుతూ గిరిజనులు ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యానికి పాల్పడిన ప్రభుత్వ అధికారులు. ఆ ప్రభుత్వ అధికారులకు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు జైలు శిక్షకు బాధ్యులు చేస్తూ షెడ్యూల్డ్ కులాలు,తెగలు (అత్యాచారాల నిరోధక) చట్టం-1989 ప్రకారము బాధ్యులు అవుతారు. మంగపేట తహసీల్దార్ కి ఇప్పటి వరకు 250 ఫిర్యాదులు ఇచ్చినాము. పరిష్కారము చేయలేదు.మంగపేట పోలీస్ స్టేషన్ లో నాలుగు పిర్యాదులు ఇచ్చినాము. వారు కేసు నమోదు చేయలేదు. ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 150 ఫిర్యాదులు ఇచ్చినాము. పరిష్కారము చేయలేదు.1989 చట్టం ప్రకారం బాధ్యులైన అధికారులపై కేసులు 15 రోజులలో నమోదు చేస్తాము.ఆర్టికల్ 19(5)ఆస్తి విషయంలో గిరిజనుల ప్రయోజనాల రక్షణ అట్టి ఆర్టికల్ చెబుతోంది.భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్వేచ్ఛగా తిరగడానికి,ఆస్తులు సంపాదించడానికి, అమ్ముకోవడానికి ప్రతి వారికి హక్కు ఉన్నప్పటికీ, గిరిజన ప్రాంతాలలో హక్కుని కుదించే శక్తి ప్రభుత్వానికి 19(5) క్లాజు కల్పిస్తుంది. గిరిజనుల ప్రత్యేకత కారణంగా ఇతరులకు హక్కులు లేవు అనేది 19(5) క్లాజు చెబుతుంది అన్నారు.గిరిజన చట్టాలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే గిరిజన చట్టాలు నిర్వీర్యం చేస్తూ అక్రమార్కులకు అండగా ఉంటున్నారని అన్నారు.వందలకొద్దీ ఫిర్యాదులు చేసినప్పటికీ, ఏ ఒక్క ఫిర్యాదుపై స్పందించకపోవడం ఉన్నతాధికారులకు ఆదివాసీల పరిరక్షణకు ఏర్పాటుచేసిన చట్టాలను అధికారులు అపహాస్యం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో మన్యసీమ పరిరక్షణ సమితి డోలుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య, జిల్లా అధ్యక్షులు యన్.లక్ష్మణ్ రావు, మండల అధ్యక్షుడు పి.ఆదినారాయణ పాల్గొన్నారు.

             

Share it:

Post A Comment: