CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సురక్ష బస్ స్టాండ్ ఆధునీకరణ పనులు ప్రారంభం

Share it:

 



👉మారనున్న మణుగూరు సురక్ష బస్టాండ్ రూపురేఖలు*

👉విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా ను ప్రశంసిస్తున్న ప్రయాణికులు

👉 పినపాక నియోజకవర్గ అభివృద్ధి రేగా కాంతారావు తోనే సాధ్యం: జెడ్పిటిసి పోశం  నరసింహారావు

మన్యం టివి ,మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యార్థం విప్ రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో డి.ఎం.ఎఫ్ నిధుల నుండి రూ.70 లక్షల రూపాయల తో మణుగూరు సురక్ష బస్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా వర్ష కాలం దృశ్య ఆగిన అభివృద్ధి పనులు,విప్ రేగా కాంతారావు అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం, తిరిగి సోమవారం ప్రారంభం అయ్యాయి.ఈ సందర్భంగా అభివృద్ధి పనులు,వేగంగా పనులు పూర్తి ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాము అని అధికారులు తెలిపారు. సురక్ష బస్టాండ్ పనులు ప్రారంభం కావడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మన్యం టీవీ పలువురు ప్రయాణికులను పలకరించగా రేగా కాంతారావు ఎమ్మెల్యే అయిన నాటి నుండి పినపాక నియోజకవర్గం లోని అన్ని మండలాలను సమభావంతో చూస్తూ ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులకు పూనుకోకుండా అభినందనీయమన్నారు. మణుగూరు జడ్పిటిసి పోశం నరసింహారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రయాణ ప్రాంగణం లేక ప్రజలు పడుతున్న అవస్థలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు కాంతారావు నిర్మాణ పనులకు నిధులు తీసుకురావడం గొప్ప పరిణామమని అని పినపాక నియోజకవర్గ అభివృద్ధి రేగా కాంతారావు తో సాధ్యమన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: