CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ఇల్లందు లో ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకలు

Share it:మన్యం టీవీ : ఇల్లందు 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు టీపిసిసి మెంబర్ ఎస్కే జానీ గారి ఆధ్వర్యంలో ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో గల జాతీయ నాయకుల విగ్రహావిష్కరణ కార్యక్రమం మరియు దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు డాక్టర్.జి.రవి పాల్గొని మాట్లాడుతూ. .భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరియు ఉక్కు మహిళ గా దేశానికి ఎంతో సేవ చేశారని, తన తండ్రి  నెహ్రూ గారి తో బాల్యం నుండే  భారత దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేశారని, గాంధీ గారు స్వాతంత్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు యువకులు విద్యార్థులు దీక్షకు సంఘీభావంగా ఉన్నారని మరియు ఆ రోజుల్లో బ్రిటిష్ వారి ఆలోచనలు మరియు కుట్రలు జాతీయ నాయకులకు తెలిసేలా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వానర సైన్యాన్ని ఏర్పాటు చేసి స్వాతంత్రం లో తన వంతు పాత్ర పోషించారని వారు తెలియజేశారు. అదేవిధంగా దేశ స్వాతంత్రం కోసం ఎన్నో సార్లు జైలు జీవితాన్ని అనుభవించి జైల్లోనే రాజీవ్ గాంధీ గారికి జన్మనిచ్చిందని తన జీవితమంతా దేశ సేవకు అంకితం చేసిందని వారు తెలిపారు. బ్యాంకులను జాతీయం చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపిందని, గరీబి హటావో కార్యక్రమం ద్వారా పేదరికాన్ని రూపుమాపాలని తపించారని , అదేవిధంగా చాలా సంక్షేమ పథకాలు దేశ ప్రజల కోసం ప్రవేశ పెట్టారని  వారు తెలియజేశారు. అతి పిన్న వయసులోనే వారు పార్టీకి చేసిన సేవకు గాను 1959లో ఏఐ సి సి ప్రెసిడెంట్ గా నియమితులై కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలందించారని, 1966-77 వరకు మూడు పర్యాయాలు మరియు 1980 లో నాలుగో సారి ప్రధాని పదవి చేపట్టి దేశానికి ఎనలేని సేవ చేశారని తెలిపారు. బిజెపి వారు సర్జికల్ స్ట్రైక్ చేసి వారికి మాత్రమే దేశభక్తి ఉన్నట్టు ప్రగల్భాలు పలుకుతున్నారని, శ్రీమతి ఇందిరా గాంధీ గారు 1971లోనే పాకిస్తాన్తో యుద్ధం చేసి వారిని ఓడించి ఆఫ్ఘనిస్తాన్ అనే దేశాన్ని స్వతంత్ర రాజ్యంగా అవతరించెలా దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు తెలిసేలా పరిపాలించి దేశభక్తిని చాటుకున్నారని, చివరికి దేశం కోసం తన ప్రాణాలు అర్పించిన మహోన్నతురాలని అని వారు తెలిపారు. బంజారాలను వారి జీవన విధానం ఆధారంగా ఎస్టీ జాబితాలో చేర్చి ఈరోజు ఎంతోమంది బంజారాలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ లు గా, ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా ఉన్నారు అంటే అది కేవలం ఇందిరాగాంధీ చలువెనని వారు తెలిపారు. కాబట్టి రానున్న కాలంలో రాష్ట్రంలో మరియు జాతీయ స్థాయిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి బంజారా బిడ్డ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీ గారి నీ ప్రధానమంత్రి చేయడం ద్వారా మాత్రమే వారికి నిజమైన నివాళి అర్పించడం అవుతుందని వారు తెలిపారు. అదేవిధంగా బహుజనులు అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం వల్ల తిరిగి ఇందిరమ్మ రాజ్యం వస్తుందని తద్వారా ప్రజల స్థితిగతులు  మారుతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల ప్రెసిడెంట్ గింజల నరసింహారెడ్డి, ఎంపిటిసి జగదీశ్ రెడ్డి, జెడ్ పి టి సి ప్రవీణ్ కుమార్, బయ్యారం మండల అధ్యక్షులు ముసలయ్య, టౌన్ ప్రెసిడెంట్ నాయిని శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేష్, గార్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్. రామచంద్రనాయక్, జీవి . భద్రం, బి ఎన్ గోపాల్, ఇందిరా, మాజీ కౌన్సిలర్ ధరావత్ క్రిష్ణ, సోషల్ మీడియా కోఆర్డినేటర్ కోటగిరి నవీన్ కుమార్, గడ్డి శ్రీను, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రెసిడెంట్ సాయి, మహేష్, రవి, అరవింద స్వామి, పోషం వెంకటేశ్వర్లు, పొడుగు రాంబాబు, ప్రవీణ్,ఐ ఎన్ టి సి నాయకులు సత్యనారాయణ, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: