CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇష్టారీతిన అధిక రేట్లకు పాఠశాల పుస్తకాలు అమ్మకాలు.!

Share it:

 


 విద్యార్ధుల తల్లిదండ్రుల నడ్డి విరుస్తూన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలి : ఆదివాసీ సేన.



మణుగూరు మండలంలో ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం.. వారి బడిలో చదివే విద్యార్థులకు ఎట్లాంటి ముద్రణ సంస్థ చిరునామా కానీ, యజమాని వివరాలు కానీ, ప్రింటింగ్ వివరాలు లేని పుస్తకాలను.. ఇటీవల విద్యా సంస్థలు తెరుచుకోవడం తో... రెండు సంవత్సరాల ఆదాయం నూ ఒక్కేసారి విద్యార్థుల వద్ద నుంచి పొందాలని ప్రయత్నం చేస్తూ... వారి బడిలో చదివే విద్యార్థులు ఖచ్చితంగా.. స్టార్ ప్లస్ అనే పేరు గల పుస్తకాలను కొనుగోలు చేస్తేనే.. బోధించడం విలుపడుతుందని హుకుం జారీచేశారు. ఈ పుస్తకాలు కేవలం.. మణుగూరు మండలంలో పాత స్టేట్ బ్యాంక్ వద్ద గల ఒక ప్రముఖ బుక్ స్టాల్ వద్ద మాత్రమే లభ్యమవ్వడం జరుగుతుందని.. అది కూడా ఎట్లాంటి ముద్రణ వివరాలు, పబ్లిషర్ వివరాలు లేకుండా , కేవలం MRP ధర మాత్రమే ముద్రించి వున్న పుస్తకాలను అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, ఈ యొక్క బుక్ స్టాల్ తో పాఠశాల యాజమాన్యం ఒప్పదం చేసుకొని.. కేవలం లాభాలు, డబ్బులే ధేయ్యంగా పని చేస్తున్నాయని, విద్యా హక్కు చట్టం, జాతీయ విద్యా విధానం ప్రకారం.. విద్యా సంస్థలు లాభాపేక్ష లేని సంస్థలుగా.. భావి భారత పౌరులనూ, దేశాన్ని నిర్మించాలని వున్న లక్ష్యం నూ దెబ్బతీస్తున్నాయనీ ఆదివాసీ సేన జిల్లా కో కన్వీనర్ వజ్జా జ్యోతి బసు ఆరోపించారు.


రెండు సంవత్సరాలుగా తరవాత విద్యా సంస్థలు తెరుచుకోవడం తో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్ల భవిష్యత్ కోసం ఆరాట పడ్తుంటే.. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేయడం దారుణం అన్నారు. పాఠశాల యాజమాన్యం మరియు బుక్ స్టాల్ నిర్వాహకులు ఒప్పడం మధ్య ఈ యొక్క పుస్తకాల కొనుగోలు జరిగిందని, అధిక రేట్లకు పుస్తకాలు విక్రయించి , అందులోని లాభాలను సదరు బుక్ స్టాల్ నిర్వాహకులు తిరిగి చెల్లిస్తారనే గుసగుసలు ప్రముఖంగా వినిపిస్తున్నాయని అన్నారు. మరోపక్క పాఠశాల యాజమాన్యంమే పుస్తకాలను నేరుగా అమ్మకం చేస్తే పాఠశాల పై అధికారులు చర్యలు తీసుకుంటారని భావించి.. బుక్ స్టాల్ నిర్వాహకులతో ఒప్పడంచేసుకొని అధిక ధరలకు పుస్తకాలు కొనుగోలు చేపిస్తూదని అన్నారు. ఏజెన్సీ లో తప్పుడు పద్దతులతో అనుమతులు పొందడమే కాకుండా... అసలు నేటికీ ఆదివాసీ,పేద విద్యార్థులకు ఉచితంగా విద్యా అందించాల్సిన కూడ అందించడం లేదని, అధికారులు కూడా ఇలాంటి పాఠశాల యాజమాన్యల పై కన్నెత్తి చూడక పోవడం అనేక అనుమానాలకు తావిస్తుందనీ ఆయన అన్నారు. విద్యార్థుల తల్లదండ్రులు నడ్డి విరుస్తున్న పాఠశాల యాజమాన్యం మరియు అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న బుక్ స్టాల్ నిర్వాహకుల పై చర్యలు తీసుకొని ప్రజలనూ కాపాడాలని ఆయన కోరారు.

Share it:

Post A Comment: