CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా

Share it:

 



మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని గడ్డం పల్లి గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆఖరి రోజైన సద్దుల బతుకమ్మ ను పురస్కరించుకొని, అత్తగారి ఊరైన గడ్డంపల్లి విచ్చేసి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డలు అత్యంత సంతోషంగా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ లను అందించిందని, అక్క చెల్లెళ్లకు చక్కనైన చీరలను పంపిణీ చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం పల్లి చుట్టుపక్కల గల ఆడబిడ్డలు, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు ఆదివాసీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: