CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్శించే నైతిక అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు

Share it:

 


మన్యం మనుగడ వాజేడు:                                            

 ఈరోజు వాజేడు మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమళ్ళ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మీడియా మిత్రులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీని గానీ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణని. గాని విమర్శించే నైతిక అర్హత భద్రాచలం డివిజన్ లోని ఏ కాంగ్రెస్ పార్టీకి నాయకుడికి లేదని భద్రాచలం ప్రాంతంలో అభివృద్ధి ఏమన్నా జరిగిందంటే అది బాలసాని లక్ష్మీనారాయణ. వల్లనే అని ఆయన అన్నారు 2017 సంవత్సరం నుండి ఈరోజు వరకు సుమారు వాజేడు మండలానికి సి డి పి. డి ఎం ఎఫ్ టి ద్వారా మూడు కోట్ల నిధులు తీసుకువచ్చి వాజేడు మండల అభివృద్ధిలో దోహదపడ్డారు కానీ భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన పోదాం వీరయ్య  వాజేడు మండలం లో ఒక తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవని ఆయన అన్నారు.  మన ప్రాంత అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వాజేడు మండలం లో కానీ వెంకటాపురం మండలంలో గాని భద్రాచలం నడిగడ్డమీ ద గాని  అభివృద్ధిపై చర్చకు వస్తే మేము రెడీగా ఉన్నాము అని ఆయన సవాల్ విసిరారు వాజేడు మండలం వెంకటాపురం మండలాల్లో ఏమీ అభివృద్ధి జరగలేదని అంటున్న నాయకులు చర్చకు వస్తే ఎమ్మెల్సీ  ఏమీ అభివృద్ధి చేయకపోతే మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు జడ్పిటిసి తో పాటు టిఆర్ఎస్ పార్టీకి మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు అబద్దాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఈ సవాలును స్వీకరించి లేకపోతే వారు గానీ వల్ల ఎమ్మెల్యే గారు గానీ రాజీనామాలు చేయడానికి సిద్ధమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తల్లడి పుష్పలత .ఎంపీపీ శ్యామల శారద. సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు  నరేష్ కుమార్ ఎంపీటీసీ గొంది రమణ రావు.  ఎల్లయ్య .సత్యనారాయణ. సాంబయ్య. శివ రామకృష్ణంరాజు. కోటేశ్వరరావు. అశోక్ రెడ్డి .నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: