CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భారత వ్యవసాయ రంగం ప్రస్తుత సవాళ్లు సెమినార్ ను జయప్రదం చేయండి ...

Share it:

 



మన్యం టివిదుమ్ముగూడెం:

 దుమ్ముగూడెం మండలంలో మూలపాడు సెంటర్లో ఉన్న యలమంచి సీతారామయ్య భవనంలో జరిగిన తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు యలమంచి రవికుమార్ మాట్లాడుతూ మన భారత దేశంలో ఇటీవల కరోనా కాలంలో అన్ని రంగాలు దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినప్పటికీ ఒక వ్యవసాయ రంగం మాత్రం లాభాలతో కొనసాగింది దేశ ఆర్థిక వ్యవస్థను పడి పోనివ్వకుండా కాపాడుతుందని ఇంతటి ముఖ్యమైన వ్యవసాయ రంగంపై కార్పొరేట్ శక్తుల కన్నుపడిందని ఆ రంగంలో కార్పొరేట్ ప్రవేశించి లాభాలు ఘటించడానికి మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సంస్కరణలను ముందుకు తెచ్చిందని అందులో భాగంగానే మూడు నల్ల చట్టాల్ని పార్లమెంటులో చట్ట రూపంలో తెచ్చి రైతుల , నడ్డి వీరిచిందని కనీస మద్దతు ధర ఊసే లేకుండా చేసిందని ఈ నేపథ్యంలో కొత్తగూడెం అక్టోబర్ 18న జరిగే సెమినార్ ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామ్రేడ్ విజ్జు కృష్ణన్ హాజరవుతున్నారని ఆయన అన్నారు వందలాది మంది ఈ సెమినార్ లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి కి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శ కునసోత్ ధర్మ, జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ,రైతు సంఘం మండల అధ్యక్షులు యలమంచి శ్రీను బాబు, ఐద్వా జిల్లా అధ్యక్షులు సరియం రాజమ్మ సర్పంచ్, కాక కృష్ణ ,కల్లూరి లక్ష్మయ్య ,గుడ్ల రామ్మోహన్ రెడ్డి, బైరెడ్డి సతీష్ ఇంకా తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: