CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అఖిలపక్షం ఆధ్వర్యంలో సడక్ బంద్ జయప్రదం

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో మంగళవారం పోడు పొలికేక సడక్ బంద్ కార్యక్రమం సిపిఎం అధ్యక్షులు యండి దావూద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణా రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో గిరిజనులు,పేదలు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములు 13,03,847 ఎకరాలు ఇందులో అటవీ హక్కుల గుర్తింపు చట్టం -2006 ప్రకారం 2008 నుంచి 2011 వరకు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.గ్రామసభల నుండి గిరిజనులు,పేదలు దరఖాస్తులు పెట్టుకోగా వేలాది దరఖాస్తులను తిరస్కరించారని.అయినా 2,12,173 వ్యక్తిగత దరఖాస్తులను హక్కులు కల్పించేందుకు నాటి ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించిందని.ఈ దరఖాస్తుల పరిధిలో 7,61,061 ఎకరాల భూమిపై హక్కులు కల్పించవచ్చని నిర్దారించింది. కానీ 93,639 దరఖాస్తులకు 3,00,284 ఎకరాలకు మాత్రమే హక్కులు కల్పించారు.మిగిలిన 1,18,534 దరఖాస్తులను కారణాలు చూపకుండా తిరస్కరించిందని.ఇంకా 10లక్షల ఎకరాల వరకు హక్కు పత్రాలు ఇవ్వాలని పై గణాంకాలన్నీ 2020 డిసెంబర్ 31న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికలో ఉన్నాయని,తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క ఎకరా భూమిపై కూడా హక్కులు కల్పించలేదు.యుపిఎ-1 ప్రభుత్వంలో వామపక్షాల ఒత్తిడితో అటవీ హక్కుల గుర్తింపు చట్టం - 2006ను పార్లమెంటులో ఆమోదించారని.ఈ చట్టం ప్రకారం 2005,డిసెంబర్ 13 నాటికి గిరిజనులు,పేదలు సాగులో ఉన్న అటవీ,పోడు భూములన్నింటికీ హక్కులు కల్పించాలి.10 ఎకరాల్లోపు హక్కులు ఇవ్వాలని స్పష్టం చేసిందని,గిరిజనేతర పేదలు మూడు తరాలు సాగులో ఉంటే హక్కులు కల్పించాలని,అడవులు ఎక్కడుంటే అక్కడ ఈ చట్టం అమల్లో ఉంటుందని అన్నారు. 

ప్రతి వర్షాకాల సీజన్ లో పోడు భూములను సాగుచేస్తున్న రైతులపై అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా దాడులు చేస్తున్నారని,వేసిన పంటలను సైతం జెసిబిలతో, కలుపు మందులుకొట్టి నాశనం చేయడం,కందకాలు తవ్వడం చేస్తున్నారని,అన్యాయం అని అడ్డుకున్న గిరిజనులు,పేదలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని,పోడు రైతులే దాడి చేశారని హత్యానేరం కింద కేసులు నమోదు చేస్తున్నారు.ఇందులో పసి పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.గ్రామాలు,గిరిజన గూడాలు,తండాలల్లో యుద్ధ వాతావరణం నెలకొన్నదని అన్నారు.ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో పోడు భూమి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసుల ద్వారా నిర్బంధం ప్రయోగిస్తూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నదని పోడు భూములకు హక్కులు కల్పించడంలో రాష్ట్ర పాలకులు అన్యాయం చేశారని,తెలంగాణా ఏర్పడగానే పోడు సాగుదారులందరికీ హక్కులు కల్పిస్తామని 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ వాగ్దానం చేసిందని ఆనాడు గిరిజన ప్రాంతాల్లో జరిగిన అన్ని బహిరంగ సభల్లో కెసిఆర్ స్పష్టమైన హామీలు ఇచ్చారని 2018 ఎన్నికల సభల్లో సైతం తిరిగి వాగ్దానాలు ఇచ్చారని అయినా ఆచరణలో అమలు కాలేదని స్వయంగా తానే జిల్లాలు పర్యటించి అక్కడే కుర్చీ వేసుకుని సమస్యలు పరిష్కరిస్తానని అసెంబ్లీలో హామీ ఇచ్చారని గత ఏడున్నర సంవత్సరాల కాలంలో ఆచరణలో ఈ వాగ్దానం అమలు కాలేదని అన్నారు. కాలయాపనకే మంత్రివర్గ ఉపసంఘం సిపిఎం మరియు అఖిల పక్ష పార్టీలు,గిరిజన, ప్రజాసంఘాలు పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని పోడు రైతు పోరాట కమిటీ గా ఏర్పడి రాష్ట్ర వ్యాపితంగా ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చాయని ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు పోడు భూములపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారని ఇప్పటికీ రెండు సార్లు సమావేశం అయనా ఎటువంటి నిర్ణయానికి రాకుండానే కాలపయాపన చేస్తున్నారని, చట్టం అమలుకు అడుగడుగున ఆటంకాలు పెడుతూ పార్లమెంటు ఆమోదించిన అటవీ హక్కుల చట్టం -2006ను పకడ్బంధీగా అమలు చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చట్టం అమలు కోసం గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటూ రెవెన్యూ,అటవీశాఖ ఆధ్వర్యంలో నాలుగు దశల్లో ఆనాడు కమిటీలు వేశారని, ఒకటి గ్రామ సభ కమిటీ, రెండోది సబ్ డివిజనల్ కమిటీ, మూడు జిల్లా కమిటీ,నాలుగు రాష్ట్రస్థాయి కమిటీలు,గ్రామ సభ కమిటీ ద్వారా పోడు సాగుదారుల నుండి విస్తృతంగా దరఖాస్తులను ఆహ్వానించారని గ్రామ సభలో దరఖాస్తులను సైతం పెట్టనీయకుండా అటవీశాఖ గిరిజనులను,పేదలను భయపెట్టి వేలాది దరఖాస్తులను తిరస్కరించే విధంగా చేశారని అన్నారు.ఆనాడు చట్టం అమలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అటవీశాఖ ద్వారా హైకోర్టులో సైతం కేసులు వేసిందని,తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని దీంతో సమస్య జఠిలమైందని, ప్రస్తుత టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చట్టాన్ని అమలు చేయకుండా మోకాలడ్డుతోందని,

పోడు రైతులపై అటవీశాఖ పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని అన్నారు.అటవీహక్కుల గుర్తింపు చట్టం 2006ను పకడ్బంధీగా అమలు చేయాలని,ముఖ్యమంత్రి హామీ మేరకు 2005 డిసెంబర్ 13 కటాఫ్ తేదీని తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2 ప్రాతిపదికగా పోడు భూములపై హక్కులు కల్పించాలని,వన సంరక్షణ సమితులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి ఆ భూమిపై పోడు సాగుదారులకు వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలని,అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని నీరు గార్చేందుకు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన అటవీ విధానం 2019 ప్రమాదకర సవరణలను తక్షణం రద్దు చేయాలని అన్నారు.పోడు భూమిపై జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పోడు సాగుదారులకు హక్కులు దక్కేవరకు పోరాటాన్ని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకన్న, కన్నాయిగూడెం జడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ, వావిలాల చిన్న ఎల్లయ్య,ఎండి రియాజ్,వావిలాల నరసింహారావు,గుండ్ల శ్రీలత దేవేందర్,మహిళా కాంగ్రెస్ నాయకురాలు రాధిక,సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు చిటపట రమేష్,చిడం లక్ష్మణ్ రావు,రైతు సంఘం నాయకులు ఎండి యాకుబ్,గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు చిరంజీవి,జిల్లా కమిటీ సభ్యులు తోలెం కృష్ణయ్య, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: