CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పారిశుద్ధ కార్మికుల సేవలు మరువలేనివి : ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు

Share it:

 మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం కరోనా కష్టకాలంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా వచ్చేందుకు అహర్నిశలు కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వర్కర్ గా గుర్తించిన విషయం విధితమే, అందులో భాగంగా వారి సేవలకు గుర్తింపుగా మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ప్రశంసా పత్రాలు మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు చేతుల మీదగా అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. . కరోనా అలాంటి విపత్తు సమయంలో పారిశుద్ధ కార్మికుల సేవలు మరువలేనివని తెలిపారు. పారిశుద్ధ కార్మికులు ఏ సమస్య వచ్చినా అండగా పాలకవర్గం తరపున మేము నిలబడతామని తెలియజేశారు. తడి పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ కార్మికులకు సహకరించాలని సహకరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్, వార్డ్ కౌన్సిలర్ వార రవి, సయ్యద్ అజామ్, అంకె పాక నవీన్ కుమార్, జి ఏ ఓ శ్రీనివాస రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ జవాన్లు పారిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: