CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏటూరు నాగారంలో పరిచయవేదిక అవగాహన సదస్సు

Share it:


 
  • ఏటూరు నాగారంలో పరిచయవేదిక అవగాహన సదస్సు
  • నియామక పత్రాలు అందజేసిన ఫౌండర్ ప్రెసిడెంట్ మంగళపల్లి హుస్సేన్ స్థానిక సీఐ  కిరణ్ కుమార్
  • అంకిత భావంతో పనిచేయాలి 
  • సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలి
  • త్వరలో ఏజెన్సీ ప్రాంతాలలో సేవా కార్యక్రమాలు

మన్యం టీవీ మంగపేట.

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఫౌండర్ ప్రెసిడెంట్ మంగళపల్లి హుస్సేన్ ఆదేశాల మేరకు ఆదివారం నాడు  ములుగు డిస్ట్రిక్ట్ ఏటూరు నాగారంలో లో గంధం ఉపేందర్ పబ్లిక్ రిలేషన్ షిప్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు పరిచయ వేదిక గా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫౌండర్ ప్రెసిడెంట్ మంగళపల్లి హుస్సేన్ ,విశిష్ట అతిథిగా విచ్చేసిన స్థానిక సీఐ కిరణ్ కుమార్, గౌరవ అతిథిగా విచ్చేసిన సొసైటీ చైర్పర్సన్ అశోక్ కుమార్, తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి రాజకుమార్,తెలంగాణ సోషల్ సర్వీస్ జనరల్ సెక్రటరీ అల్వాల మహేందర్, ములుగు డిస్ట్రిక్ట్ భూపాలపల్లి జిల్లా వారికి నియామక పత్రాలు ,ఐడి కార్డులు ,సర్టిఫికెట్స్, అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా, స్థానిక సీఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, మంచి స్ఫూర్తితో వెళ్తున్నా ఈ ఆర్గనైజేషన్ మా సహాయ సహకారాలు, ఉంటాయని సమాజంలో ఏదో ఒకటి  చేస్తేనే గుర్తింపు లభిస్తుందని అన్నారు, ఈ సందర్భంగా మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో శాంతిభద్రతలు మెరుగ్గానే ఉన్నాయని కరోనా సమయంలో లో పోలీస్ సేవలు పారిశుద్ధ కార్మికులు డాక్టర్ సేవలు వెలకట్టలేని అని అన్నారు, నూతనంగా ఎన్నికైన ములుగు డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు సమాజంలో జరుగుతున్న దురాక్రమణ అరికట్టడానికి దోహదపడాలని శాంతి మార్గంలో పయనించాలని అన్నారు, విద్యా, వైద్య ,ఆరోగ్య, న్యాయ,రెవెన్యూ, పలు విషయాలపై స్పందించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని అన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి రాజ్ కుమార్ తెలంగాణ సోషల్ సర్వీస్ జనరల్ సెక్రటరీ అలవాల మహేందర్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ రిలేషన్ షిప్ ప్రెసిడెంట్ గడ్డం ఉపేందర్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సోషల్ సర్వీస్ జాయింట్ సెక్రెటరీ గడ్డం ప్రశాంత్, ములుగు డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అనంతుల నరసింహ రావు, తెలంగాణ స్టేట్ ఎంసెట్ ఇన్ ప్రెసిడెంట్ జజా రవి, చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ప్రెసిడెంట్ సిద్దిరాల సంతోష్ కుమార్, భూపాలపల్లి జిల్లా ప్రెసిడెంట్ ఖాదర్ భాషా, వైస్ ప్రెసిడెంట్ సులోచన, క్రమశిక్షణ కమిటీ ప్రెసిడెంట్ అఖిల్ పాషా, మహబూబాబాద్ జిల్లా సోషల్ సర్వీస్ ప్రెసిడెంట్ నదీమ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు,

Share it:

TELANGANA

Post A Comment: