CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా ముగిసిన బతుకమ్మ పండుగ..

Share it:

 



👉 మహిళల ఆటపాట లతో మురిసిన పల్లె..


👉 పూల పండుగ సందడితో పల్లె విరబూసింది..


మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 14, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని పడమట నర్సాపురం లో ఘనంగా బతుకమ్మ పండుగ ముగింపు వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతోటి మహిళలు పూజిస్తారు. సద్దుల బతుకమ్మ తో పండుగ ముగింపు కావడంతో తీరోక్క పూల తోటి బతుకమ్మను అందంగా పేర్చి గ్రామంలోని మహిళలంతా సీతా రామ చంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో గురువారం సాంప్రదాయ నృత్యంలో బతుకమ్మలాడారు. డీజే పాటల సందడిలో, కోలాటాల నృత్యాలతో, చప్పట్ల ధ్వనులతో చిన్నారులు, యువతులు, మహిళల ఆట, పాటలతో పల్లె మురిసిపోయింది. రంగురంగుల పూలతో బతుకమ్మలు, రంగురంగుల సాంప్రదాయ దుస్తులలో చిన్నారులు, మహిళల సందడితో పల్లె విరబూసిన పూదోటగా మారింది. మహిళల కోలాట నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

Share it:

Post A Comment: