CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇందిరాగాంధి పాలనలో నిస్వార్ధ రాజకీయం... దేశాభివృద్ధికి బాటలు

Share it:



  • ఇందిరాగాంధి పాలనలో నిస్వార్ధ రాజకీయం... దేశాభివృద్ధికి బాటలు
  • బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇందిరాగాంధీ
  • భారతదేశ అభివృద్ధి కీలకపాత్ర పోషింది కాంగ్రెస్ పార్టీ
  • పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్డు లో గల  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఇందిరమ్మ వర్ధంతి వేడుకలు


మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం

 


భారతదేశం అభివృద్ధి జరిగిందంటే అది ఇందరమ్మ రాజ్యంలోనే, భారత రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణల ప్రాంత బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరిగిందనేదానికి ఇందిరమ్మ పాలన ఒక్కటే సాక్ష్యమని పినపాక మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొడిశాల రామనాథం  కొనియాడారు. ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకల సందర్భంగా పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం అధ్యక్షతన  ఇందిరమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.    


ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం  మాట్లాడుతూ.


నిస్వార్థ రాజకీయ ప్రధానిగా అడుగిడి స్వార్థానికి ఆమడదూరంలో ఉంటూ పేదలు ఆర్థికంగా ఎదగాలనేది ఇందిరాగాంధీ ఆలోచన విధానమని అన్నారు.


 భారతదేశాభివృద్ధికోసం ఎనలేని కృషిచేసిన భారత ప్రధానులలో అత్యున్నత ఘనత దక్కించుకున్న మొదటి మహిళా ప్రధాని అని అన్నారు.


ఆహర్నిషలు కష్టపడి నిరుపేదల అభివృద్ధికోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఇందిరాగాంధికే దక్కుతుందని అన్నారు.


సాగు, తాగు నీరు లేక కష్టపడుతున్న దళితుల అభివృద్ధి కోసం నీటి వసతి కోసం భావులను తొవ్వించిన ఘనత ఇందరాగాంధిదేనని అన్నారు.


ప్రతి పక్షపార్టీల నాయకులకు కల్లు మిరిమిట్లు గొలిపేలా రాజకీయ చైతన్యం సాగించిందని,


దేశాభివృద్ధిలో ఇందరాగాంధీ చేసిన సేవలు అమోగమని,


స్వార్ధపూరిత రాజకీయాలకు చోటు లేకుండా దేశంకోసం పనిచేసి అభివృద్ధికి నాందిగా పేరుతెచ్చుకుందని అన్నారు.


ప్రస్తుతం కొందరు నాయకులు స్వార్థరాజకీయాలను చేస్తూ ఆర్థికంగా బలపడడానికే తప్ప ఇంకోకటి లేదని అన్నారు.


ఈ కార్యక్రమానికి మండల ఉపాధ్యక్షుడు కొంబర్తిని శ్రీను, మహిళా మండల అధ్యక్షురాలు పాయం  సమ్మక్క, ఎస్సీ సెల్  మండల అధ్యక్షుడు జాడి రాంబాబు, బీసీ సెల్ ప్రెసిడెంట్ మునిగల వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ ఎస్.కె మదర్ సాహెబ్, మండల కార్యదర్శి జక్కా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు  శాఖమూడి సత్యం, జరుపుల రాము, పొనుగోటి చందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: