CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జంపన్నవాగులో ఆదివాసీ విద్యార్థి మృతి

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గోనెపల్లి వద్ద గల జంపన్నవాగులో సప్క సుశాంత్(9) అనే ఆదివాసీ విద్యార్థి(బాలుడు) ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వెంగళాపురం గ్రామపంచాయతీ పరిధిలోని గోనెపల్లి సప్క నాగభూషణం,

సంధ్య ల ఏకైక కుమారుడు సుశాంత్ ఏటూరునాగారం మండలం లోని చిన్నబోయినపల్లి ప్రభుత్వ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు.ఆశ్రమ పాఠశాలలు ఇంకా ఓపెన్ కాకపోవడంతో సుశాంత్ గోనెపల్లి లో తల్లి తోనే ఉంటున్నాడు.సోమవారం స్నేహితుల పిల్లలతో కలసి గోనెపల్లి వద్ద గల జంపన్న వాగు బ్రిడ్జి పై ఆటల ఆడుతుండగా ప్రమాదవశాత్తు జారీ సుమారు మధ్యాహ్నం సమయంలో లో జంపన్నవాగులో పడిపోయాడు.జంపన్న వాగు ఆ ప్రాంతంలో లోతు ఉండడంతో అందులో మునిగి చనిపోయి తేలాడు. గ్రామస్తులు బయటికి వెతికి తీశారు.గత కొన్ని సంవత్సరాల క్రితం చిన్న వయసులోనే సంధ్య భర్త,నాగభూషణం మృతి చెందడంతో ఒకే ఒక కుమారుడు సుశాంత్ ను చూసుకుంటూ తల్లి జీవనం సాగిస్తుంది.సుశాంత్ ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి మృతి చెందడంతో తల్లి,బంధువుల గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి.గోనెపల్లి, వెంగళాపూర్ గ్రామాలు శోకసముద్రంలో మునిగాయి. కాగా సప్క సుశాంత్ ఆదివాసీ విద్యార్థి ఆశ్రమ పాఠశాల ఓపెన్ కాకపోవడం వల్ల ఆదివాసీ విద్యార్థి మృతి చెందాడని, పాఠశాల ఓపెన్ అయితే ఆశ్రమ పాఠశాలలో చదువుకునే ఉండేవాడని దీనికి కారణం,సుశాంత్ చావుకు ప్రభుత్వం బాధ్యత వహించాలని,పేద ఆదివాసి విద్యార్థి అయిన సుశాంత్ కుటుంబాన్ని ఐటీడీఏ ఏటూరునాగారం,ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని,ఆదివాసీ గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Share it:

Post A Comment: