CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలి

Share it:

 


ఘనంగా కొమురం భీమ్ 81 వ వర్థంతి

 ముఖ్య అతిధిగా ములుగు జిల్లా కలెక్టర్,ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య.

మన్యం టీవీ ఏటూరు నాగారం                            

ఆదివాసీల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య అన్నారు.ఆదివాసి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కోమరంభీం 81వ వర్ధంతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా వై జంక్షన్ నుండి ఐ టి డిఎ వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐ టి డీ ఏ కార్యాలయంలో కొమురంభీo విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ములుగు జిల్లా కలెక్టర్ ఐటిడి ఏ ఇంచార్జి ప్రాజెక్ట్ అధికారి కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ ఆదివాసీల అస్తిత్వం కోసం పోరాటం చేసిన మహనీయుడు కొమరం భీం వర్ధంతి రోజున ఐటిడిఎ ప్రాంతంలో పండగ వాతావరణంలా వర్ధంతి కార్యక్రమం,నిర్వహించుకోవాలని ఇట్టి ఏర్పాటు కోసం అధికారులు కృషి చేయాలని అధికారులనుమందలించారు.ఆదివాసీలు విద్యలో రాణించి మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలనిఅన్నారు.ఆదివాసులకు విద్య వైద్యం ఆదివాసుల హక్కులు కల్పించడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జల్-జంగల్-జమీన్అంటూ జంగ్ సైరన్ ఊదిన ఆదివాసీ ధీరుడు మావ నాటే - మావ సాటే‌ అని గర్జించిన‌ గెరిల్లా పోరాట వీరుడు

నిజాం నిరంకుశత్వం పై తిరగబడ్డ యోధుడు కొమురం భీం 81 వ వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోశమని అన్నారు.జనజాతి అభ్యున్నతికై అసువులు బాసిన అమరుడు గూడెం గుండెలలో కొలువైన దేవుడు అని అన్నాడు.జనజాతి స్వాభిమాన పోరాటం కోసం జోడేంఘాట్ లో నేలకొరిగిన ఆదివాసి కీర్తిపతాక కుమ్రం భీమ్ అనిఅన్నాడు.

పచ్చని అడవి‌ తల్లి‌ని తన రక్తంతో అభిషేకం చేసి ఆదివాసీల భవిష్యత్తు కు బంగారు బాటలు వేసిన మహానీయుడు కోమరంభీం అని అన్నాడు.కొమురంభీం ఆశయాలను నేరవేర్చే విధంగా ప్రతి ఆదివాసీ ముద్దు బిడ్డలు కలిసి కట్టుగా పనిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీవో వసంతరావు,ఏవో రఘు,మేనేజర్ లాల్,డిటిడిఓ మంకిడి ఎర్రయ్య,పొడెం రత్నం,పొడెం బాబు,చెరుకుల ధర్మయ్య,నరసయ్య, బాబురావు, కొమురం ప్రభాకర్,ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు ఆదివాసీలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: