CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జ్వరాలతో బాధపడుతున్న చర్ల మండలం వీరాపురం గ్రామానికి చెందిన 34 కుటుంబాలకు వైద్య చికిత్సలు చేయించిన చర్ల పోలీసులు.

Share it:


చర్ల సిఐ అశోక్,ఎస్సైలు రాజువర్మ,వెంకటప్పయ్య మరియు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అక్టోబర్ 3 (మన్యం టీవీ) :- ఆదివారం నాడు చర్ల మండలంలోని కుదునూరు సమీపంలో అటవీ గిరిజన ప్రాంతమైన వీరాపురంలో పిల్లలు మరియు పెద్దలు అనే తేడా లేకుండా 34 కుటుంబాల వారు జ్వరాలతో బాధపడడం,వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. సమాచారం తెలుసుకున్న చర్ల సీఐ అశోక్,ఎస్ఐ రాజువర్మ మరియు ఎస్సై వెంకటప్పయ్య మానవతా దృక్పథంతో ఆ గ్రామంలోని 34 కుటుంబాలను చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వాహనాల ద్వారా తరలించారు. అనంతరం చర్ల ప్రభుత్వ వైద్యశాలలో 43 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 5గురికి డెంగ్యూ,26 మందికి మలేరియా పరీక్షలు చేయించగా ఒకరికి మలేరియా పాజిటివ్ గా తేలింది.చర్ల సీఐ అశోక్ ఆధ్వర్యంలో ఎస్సై రాజు వర్మ,ఎస్సై వెంకటప్పయ్య మరియు సిబ్బంది దగ్గరుండి గిరిజనులకు వైద్యం చేయించి,మందులు ఇప్పించడం జరిగింది.ఈ సందర్భంగా చర్ల పోలీసుల ఆధ్వర్యంలో  గిరిజనులకు నిత్యావసర సరుకులు,పండ్లు,కూరగాయలు, దోమతెరలు పంపిణీ చేశారు. అనంతరం వారి ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గిరిజనులకు చర్ల పోలీసులతో పాటు సహాయ సహాకారాలందించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ సుమ కి,సిబ్బందికి ఈ సందర్భంగా చర్ల పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ మారుమూల అటవీ ప్రాంత గిరిజనులను వాహనాల ద్వారా తీసుకు వచ్చి వైద్య చికిత్సలు చేయించిన చర్ల సిఐ అశోక్,ఎస్సైలు రాజు వర్మ,వెంకటప్పయ్య మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

చాలా మంది ఆదివాసీ గిరిజనులు,మిలీషియా సభ్యులు,మావోయిస్ట్ పార్టీ సానుభూతిపరులు మరియు ఛత్తీస్ఘడ్ రాష్ట్రానికి చెందిన దళ సభ్యులు తీవ్రమైన జ్వరాలతో బాధపడుతున్నట్లు మాకు సమాచారం ఉందని ఈ సందర్భంగా ఎస్పీ ఒక ప్రకటనలో తెలియజేసారు.జ్వరాలతో బాధపడుతున్న వీరందరికి మావోయిస్టు పార్టీ సరైన వైద్యం అందించకపోగా,మెరుగైన వైద్యం కోసం బయటకు రావడానికి చూస్తున్న వారిని కూడా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ నాయకులు వారిని బలవంతంగా అడ్డుకుంటున్నారని తెలిపారు.గిరిజన ప్రజలు,సానుభూతిపరులు,మిలీషియా సభ్యులు మరియు దళ సభ్యులు అందరూ కూడా మావోయిస్ట్ పార్టీ నాయకత్వాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.అనారోగ్య సమస్యలతో బాధపడే వారంతా మెరుగైన వైద్యం కోసం పోలీసు వారి సహాయం తీసుకోవాలని కోరారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు కేవలం వారిని వారు రక్షించుకోవడానికి,వారి స్వప్రయోజనాల కోసం మాత్రమే అమాయకపు గిరిజనులను వాడుకుంటున్నట్లు ఇటీవల మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధులు విడుదల చేసిన లేఖల ప్రకారం స్పష్టమవుతుందని అన్నారు.మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు అదీవాసి గిరిజనులకు,యువతకు సౌకర్యాలు,ఉద్యోగాలు అందకుండా చేస్తూ మోసపోరితమైన సిద్ధాంతాల ద్వారా ఏర్పరుచుకున్న లక్ష్యాల కోసం అమాయకులను వాడుకుంటున్నారని తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: