CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం: ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు 30 మంది లబ్ధిదారులకు 8లక్షల 75 వేల రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Share it:

 


మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శనివారం మణుగూరు మండల,పట్టణ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 30 మంది బాధితులకు సీఎం సహాయక నిధి నుండి మంజూరు ఐన రూ.8,75,500 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ,పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.సీఎం కేసీఆర్ పరిపాలన లో జరుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా,నిలుస్తునాయన్నారు.గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ అతి తక్కువ కాలంలోనే చేసి చూపిస్తున్నారు అని,పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.నిరుపేద కుటుంబాలు,వైద్య ఖర్చులు నిమిత్తం అప్పులు చేసి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో,సీఎం సహాయనిధి ద్వారా నగదు మంజూరు చేసి, వారికి భరోసా కల్పిస్తున్నారని అని పేర్కొన్నారు.అదే విధంగా వృద్దులకు ఫెంక్షన్లు,ఆడ బిడ్డలకు కళ్యాణ లక్ష్మీ,షాద్ ముబారక్,రైతులకు రైతు బంధు,రైతు భీమా,లాంటి అనేక పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు,సంక్షేమం అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం,సీఎం కేసీఆర్ అని తెలిపారు.మనిషి పుట్టుక నుండి కేసీఆర్ కిట్ నుండి మొదలు పెట్టి,మనిషి చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కోసం స్మశాన వాటికల నిర్మాణం వరకు 75 సంవత్సరాల భారత దేశంలో, ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల ను తెలంగాణ లో,సీఎం కేసీఆర్ చేస్తున్నారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం.విజయకుమారి, జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు,ఎంపీటీసీలు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా,సర్పంచ్ లు ఏనిక. ప్రసాద్,కారం.ముత్తయ్య,బొగ్గం.రజిత,కొమరం,జంపేశ్వరి,ఈశ్వరమ్మ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, కార్యదర్శులు రాం రెడ్డి,నవీన్, పార్టీ నాయకులు,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: