CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్టోబర్ 25న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి కెవిపిఎస్ పిలుపు...

Share it:

 



👉ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విడుదల చేయ్యాలి..

👉 ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను తక్షణమే నియమించాలి..

👉 ఎస్సీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయ్యాలి..


మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 21, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దళిత గిరిజనుల పై జరుగుతున్న దాడులు ఇతర దౌర్జన్యాల గురించి తమ గోడు చెప్పుకోవడానికి ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లేక అది తల లేని మొండెం గా ఉన్నదని, రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు రాష్ట్రమంతటా ఇస్తామని వాగ్దానం..! ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని జూలూరుపాడు మండల ప్రజలు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయ్యాలని కెవిపిఎస్ మండల ఇన్ చార్జీ గార్లపాటి వెంకటి అన్నారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గార్లపాటి వెంకటీ మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి బ్యాంకు లింకేజీ లేకుండా రుణాలు ఇవ్వాలని, మరియు ఇతర అనేక డిమాండ్లు పరిష్కరించాలని, కోరుతూ అక్టోబర్ 25న కలెక్టరేట్ వద్ద మహా ధర్నా కు పిలుపునిచ్చారు. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంటనే నియమించాలని అన్నారు. జిల్లాలోని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా రుణాన్ని ఇవ్వాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా మూడు లక్షల దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని ఇవ్వాలని అన్నారు. దళితులే అధికంగా ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల స్కీమ్ వర్కర్ల అందరికీ కనీస వేతనం ఇవ్వాలని అన్నారు. 200 యూనిట్లు దళితులకు ఉచిత కరెంటు ఇవ్వాలని అన్నారు. ప్రతి దళితవాడకు రెండు ఎకరాల ఆవాస స్థలం ఇవ్వాలని అన్నారు. దళిత వర్గాల అభివృద్ధికి నిర్దిష్ట చర్యలు అనగా ఇంటి స్థలం, డబల్ బెడ్రూమ్ ఇల్లు, మంచినీళ్లు, కరెంటు, కమ్యూనిటీ హాల్ తక్షణమే సమకూర్చాలని అన్నారు. లేనిపక్షంలో భారీ ఎత్తున ఉద్యమాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ మరియు తిరువేధుల కార్తీక్, దేవరకొండ నిర్మల, మైసమ్మ, వెంకటమ్మ, శృతి ముఖేష్ లెనిన్ నిఖిల్, రవి నూకపోగు రమేష్, సుజాత నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: