CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ నెల 22 న కరకగూడెం మండల టీఆరెస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం

Share it:

 


మన్యం టీవి, కరకగూడెం:

TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు శ్రీ రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు కరకగూడెం మండలంలో 22-10-2021 తేదీన శుక్రవారం ఉదయం 11.00లకు మండలంలోని అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,కార్యదర్శులు,సర్పంచులు,ఉప సర్పంచులు,ఎంపీటీసీలు,వార్డు సభ్యులు,పార్టీ అనుబంధ సంఘాలు, సన్నాహక సమావేశంలో తప్పకుండా హజరుకవలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శి రావుల సోమయ్య,బుడగం రాము,ప్రజాప్రతినిధులు ఎంపిపి రేగా కాళిక,జడ్పీటీసీ కొమరం కాంతారావు,మండల ముఖ్య నాయకులు తెలిపారు.

పార్టీ బలోపేతంమే లక్ష్యంగా టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు ఆదేశించారు.

బుధవారం నాడు హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో పినపాక నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులతో మంత్రి కేటీఆర్ గారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లో ఈ నెల 25న జరిగే ప్లీనరీతో పాటు వచ్చే నెల 15 న వరంగల్ లో జరిగే తెలంగాణ విజయగర్జనకు భారీ స్థాయిలో ప్రజలను,కార్యకర్తలను తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రతి గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీని బలోపేతం చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.

Share it:

Post A Comment: