CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బి.టి.ప.యన్‌ పని చేస్తున్న కార్మిక సమస్యలను పరిష్కారించాలి:టీఎస్పీఈ యూ- 1535 రాష్ట్ర అధ్యక్షులు యం.ఎ వజీర్‌

Share it:

మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని బి.టి.ప.యన్‌ పని చేస్తున్న కార్మిక సమస్యలను పరిష్కారించాలి అని,టీఎస్పీఈ యూ- 1535 రాష్ట్ర అధ్యక్షులు యం.ఎ వజీర్‌ అన్నారు. యాజమాన్యం ఉదాసీన వైఖరి వీడకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.మణుగూరు లోని బి.టి.పి.యస్‌ లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.కార్మికులకు ఇప్పటికీ పూర్తి స్థాయి లో మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొన్ని విభాగాల్లో త్రాగునీరు కూడా బయటి నుండి కార్మికులే కొనుగోలు చేసుకుని తాగాల్సిన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు అంబులెన్సు సౌకర్యం కల్పించాలని కోరారు. వైద్యులు మరియు పారా మెడికల్‌ సిబ్బందితో కూడిన పి.హెచ్‌.సి *ప్రాధమిక ఆరోగ్య కేంద్రం* ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.కర్మాగారంలో క్యాంటీన్‌ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలన్నారు.ఈ కర్మాగారం లో పని చేస్తున్న ఉద్యోగులకు జనరేటింగ్‌,షిఫ్ట్‌ అలవెన్సు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చాలా విభాగాల్లో కార్మికుల సంఖ్య తక్కునగా ఉండడంతో పని భారం అధికమవుతుందని పేర్కొన్నారు.బి.టి.ప.యస్‌ లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్పీఈ యూ -1535 యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు యం.ఎ వజీర్‌,నాయకులు ఆధ్వర్యంలో వినతి పత్రం ను చీఫ్‌ ఇంజనీర్‌ పి.బాలరాజుకు అందజేశారు.ప్రస్తుతం కర్మాగారంలో పని చేస్తున్న నిర్మాణ కార్మికులను, కర్మాగారంలో అవసరము ఉన్న చోట కాంట్రాక్టు కార్మికులుగా నియమించాలని కోరారు. వినతి పత్రంలో పేర్కొన్న సమస్యలు పరిష్కరిస్తానని చీఫ్‌ ఇంజనీర్‌ పి బాలరాజు సానుకూలంగా స్పందించారు అని తెలిపారు.ఈ కార్యక్రమం లో యూనియన్‌ సెంట్రల్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి డి.రాధాకృష్ణ,జెన్‌కో అధ్యక్షుడు పి.రాము,కేంద్ర కమిటీ సభ్యులు యం.శ్రీధర్‌,ఎ. వెంకటేశ్వర్లు,బిటిపియన్‌ రీజియన్‌ అధ్యక్ష కార్యదర్శులు వి.ప్రసాద్‌,యం. రాజమనోహర్,వర్మింగ్‌ ప్రెసిడెంట్‌ యన్‌.డి.రఫి, కోశాధికారి శ్రీనివాసన్‌ రావు, మహిళా నాయకురాల్లు జానీ భేగం,రమ తదితరులు పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: