CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆరుబయట పాఠాలు... వర్షం వస్తే ఎక్కడికి వెళ్తారో?

Share it:

 


- ప్రమాదపు అంచున పసికందులు

- శిధిలావస్థలో గోపాలరావుపేట పాఠశాల భవనం

- నిద్రావస్థలో అధికారులు

-పెచ్చెలు గా ఊడి పడుతున్న వైనం 

- భయాందోళనలో ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులు

- పాఠశాలను పరిశీలించిన ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు చింతపంటి సత్యం

 భద్రాద్రి కొత్తగూడెం,పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో ప్రాథమిక పాఠశాల రోజురోజుకు పెచ్చలు గా ఊడి పడుతూ పాడుబడ్డ భవనంలా తయారవుతుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ మా పాఠశాలలో 50 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని తరగతి గదిలోకి వెళ్లాలంటే భయమేస్తుందని గది మొత్తం క్రుంగి పై నుండి పెచ్చెలు రాలి పడుతున్నాయన్నారు. తేళ్లు పాములు వొస్తున్నాయని అందువల్ల లోపలకి పిల్లలను రానివ్వకుండా ఆరుబయట పాటలు చెప్తున్నాముఅని పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇదే విషయమై అధికారులకు రాతపూర్వకంగా తెలియజేశామన్నారు. దీనివల్ల తల్లిదండ్రులు పాఠశాలకు తమ పిల్లలను పంపడానికి ఆసక్తి చూపడం లేదన్నారు, పాఠశాల భవనాన్ని వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు అదేవిధంగా గ్రామంలో తాత్కాలికంగా ఏదైనా భవనాన్ని మాట్లాడి పాఠశాలకు అప్పగించాల్సిందిగా ఎంపీటీసీని కోరారు. 

- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్తా ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు చింతపంటి సత్యం

మన్యం టీవి, పినపాక:

              పాఠశాల భవనాన్ని పరిశీలించడానికి వెళ్లిన ఎంపీటీసీ చింతపండు సత్యం మాట్లాడుతూ చంటి పిల్లలకు బయట కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చేస్తామని. అలాగే ఈ విషయాన్ని తక్షణమే కొత్త భవనం మంజూరు అయ్యేవిధంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టి కి వెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. అలాగే గ్రామస్తులు ఎవరిదైనా గృహము ఖాళీగా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారితో మేము స్వయంగా వెళ్లి మాట్లాడి భవనం నిర్మించే వరకు పాఠశాలకు అప్పగించి పిల్లలకు ఉపాధ్యాయులు సహకరిస్తామన్నారు.

- కాంతారావు సారూ మా పిల్లల భవిష్యత్తు కి బాటలు వేయండి తల్లిదండ్రుల ఆవేదన:

               అటు ప్రైవేటు పాఠశాలల ఫీజు భారం మోయలేక మా పిల్లలను మా ఊరి ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నాము. తీరా పాఠశాల భవనం ఉన్నది ఒక్కటే అది కుంగిపోతుంది మరోపక్క పెచ్చులూడి పడుతున్నాయి పిల్లలను బడికి పంపించాలంటే భయంగా ఉంది అటు ప్రైవేటు పాఠశాలకు పంపలేక ఇటు పాడుబడ్డ భవనంలో కి పంపలేక మా మధ్య తరగతి కుటుంబాలు నలిగిపోతున్నాయి. దయచేసి మా పేదల సారు ఎమ్మెల్యే కాంతారావు సారు మా పిల్లలకు పెద్ద తండ్రిలా ఆలోచన చేసి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని, పాఠశాల భవనం తోపాటు అన్ని వసతులు చేకూర్చాలని కోరుకుంటున్నారు.

Share it:

Post A Comment: